8, నవంబర్ 2025, శనివారం

మనదేశం (1949) చిత్రం కోసం ఘంటసాల మాస్టారు బాణీలు కూర్చిన, పాడిన పాటలు

 


వృత్తిపరంగా L. V. ప్రసాద్ అని పిలువబడే అక్కినేని లక్ష్మీ వర ప్రసాద రావు (1907 - 1994),  భారతీయ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, నటుడు మరియు వ్యాపారవేత్త. అతను భారతీయ సినిమా మార్గదర్శకులలో ఒకడు మరియు భారతదేశంలో చలనచిత్రాలకు అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. 1980లో, తెలుగు సినిమాకు ఆయన చేసిన కృషికి రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది.

L. V. ప్రసాద్ దర్శకత్వం వహించిన మీర్జాపూర్ రాజా సాహెబ్ (మేకా రంగయ్య) మరియు వారి రాణి శ్రీమతి సి.కృష్ణవేణి సమర్పణలో శోభానాచల పిక్చర్స్ బ్యానర్పై 1949 లో నిర్మించిన భారతీయ తెలుగు భాషా చిత్రం “మన దేశం”. ఇది శరత్ చంద్ర చటోపాధ్యాయ రచించిన బెంగాలీ నవలవిప్రదాస్” ఆధారంగా రూపొందించబడింది భారత స్వాతంత్ర్య సంగ్రామం నేపథ్యంగా నిర్మించబడ్డ ఈ చిత్రంలో వి.నాగయ్య, సి.హెచ్.నారాయణరావు మరియు కృష్ణవేణి నటించారు, ఘంటసాల సంగీతం సమకూర్చారు. సినీ పరిశ్రమలో ఎన్.టి.రామారావుకు పోలీసు ఇన్స్పెక్టర్ పాత్రలో నటించిన తొలి చిత్రమిది. ఈ చిత్రం ద్వారానే ఘంటసాల మాస్టారు సంగీతదర్శకునిగా, పి.లీల గాయనిగా పరిచయమయ్యారు. ఈ చిత్రంలో పాటలు, శ్లోకాలు కలసి సుమారు 19 వరకు వున్నాయి. ఒక గుజరాతీ పాట వైష్ణవ జనతో – నరసింహ మెహతా వ్రాయగా, మిగిలిన పాటలన్నీ సముద్రాల రాఘవాచార్యులు వ్రాసారు.


~ చిత్రం వివరాలు ~

చిత్రం#విడుదల నిర్మాణంచిత్రంసంగీతంనిర్మాతదర్శకుడు
1324.11.1949 ఎం.ఆర్.ఏ.మనదేశంఘంటసాలసి.కృష్ణవేణిఎల్.వి.ప్రసాద్

~ పాటల వివరాలు ~

#పాట/పద్యం/శ్లోకంతీరు రచనపాడినవారుఅభినయం
1జయ జననీ పరమపావనీ(యు)   సముద్రాల సీ.ఘంటసాల, సి.కృష్ణవేణినేపథ్యగీతం
2ఒహో! భారత యువకా     (బృం)  సముద్రాల సీ.ఘంటసాల,బృందంసి.హెచ్.నారాయణరావు, తదితరులు
3కళ్ళ నిన్ను చూచినానే(యు)సముద్రాల సీ.ఘంటసాల, జిక్కీరేలంగి, లక్ష్మీకాంత
4వెడలిపో వెడలిపో       (బృం)సముద్రాల సీ.ఘంటసాల, బృందంసి.కృష్ణవేణి, తదితరులు
5మాటా మర్మము నేర్చిన(బృం)సముద్రాల సీ.ఘంటసాల, సి.కృష్ణవేణిసి.కృష్ణవేణి, లక్ష్మీకాంత, సురభి బాలసరస్వతి
6జననీ జన్మభూమిశ్చ   (శ్లో)రామాయణంఘంటసాలనేపథ్యగీతం
7దారులు కాచే  (బుర్రకధ) (బృం)సముద్రాల సీ.     ఘంటసాల, సి.కృష్ణవేణిసి.కృష్ణవేణి, బాలసరస్వతి
8వైష్ణవ జనతో (గుజరాతీ)(ఏ)నరసింహ మెహతా                ఘంటసాలనేపథ్యగీతం
9యేషా మధ్యే కాంచితంనో:(శ్లో)భగవద్గీతఘంటసాలనేపథ్యగీతం
10అత్తలేని కోడలుత్తమురాలు(బృం)సముద్రాల సీ.సి.కృష్ణవేణి, బృందం  సి.కృష్ణవేణి
11ఇది వెరపో మతి మరపో(ఏ)సముద్రాల సీ.   సి.కృష్ణవేణిసి.కృష్ణవేణి
12ఏమిటో సంబంధం ఎందుకో(యు)సముద్రాల సీ.   ఎం.ఎస్.రామారావు, సి.కృష్ణవేణి     నారాయణరావు, సి.కృష్ణవేణి
13ఛలో ఛలో రాజా(యు)సముద్రాల సీ.       ఎం.ఎస్.రామారావు, సి.కృష్ణవేణినారాయణరావు, సి.కృష్ణవేణి
14జడియకుడా ధీరా(ఏ)సముద్రాల సీ.సిహెచ్.నాగయ్యనాగయ్య
15జయహో జయహో మహాత్మా (అ)(బృం)సముద్రాల సీ.ఘంటసాల, సి.కృష్ణవేణి, బృందం              బృందం
16నిర్వేదమేలా కన్నీరదేలా(బృం)సముద్రాల సీ.సిహెచ్.నాగయ్య, బృందంనాగయ్య
17బావను మెప్పించాలి(ఏ)సముద్రాల సీ.సి.కృష్ణవేణిసి.కృష్ణవేణి
18మరువలేనురా నిను నేను(ఏ)సముద్రాల సీ.జిక్కీలక్ష్మీకాంత
19మావా నందయ మావా(ఏ)సముద్రాల సీ.జిక్కీలక్ష్మీకాంత

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి