అభ్యుదయ సినీ కవుల జంట - సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు
సుంకర సత్యనారాయణ గారు (1909 - 1975) మరియు వాసిరెడ్డి భాస్కరరావు గారు (1914 - 1957) సంయుక్తంగా బుఱ్ఱకథలు చెప్పారు, ఎన్నో రచనలు చేసారు. వారిరువురు కలసి లో విడుదలైన పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షంస్ వారి "పల్లెటూరు" చిత్రానికి రెండు పాటలు తప్ప మిగిలినవన్నీ వ్రాసారు. వీటికి సంగీతం ఘంటసాల మాస్టారు సమకూర్చారు. సుంకర రచించిన మరొక రెండు పాటలను పెండ్యాల మరియు మాస్టర్ వేణు జ్యోతి' (1954) మరియు 'ఏది నిజం?' (1956) చిత్రాలకు చెరొకటి స్వరపరచారు. వాటిని ఘంటసాల మాస్టారు 'తెలుసుకోండి దీని మహిమ' (జ్యోతి) అనే ఏకగళ గీతాన్ని మరియు 'ఏది నిజం, ఏది నిజం' (ఏది నిజం) అనే గీతాన్ని మాధవపెద్ది, బృందంతో కలసి గానం చేసారు. సుంకర - వాసిరెడ్డి గార్లు పాటలే కాక కొన్ని చిత్రాలకు కథ, మాటలు కూడ వ్రాసారు, వారి సమగ్ర జీవిత విశేషాలు, నాటకరంగ, చలనచిత్రరంగ పరిచయాలు మరియు రచనల విషయాలను వారి పేర్లకు ఇచ్చిన వికిపీడియా లింకులను క్లిక్ చేస్తే చదవగలరు.
శ్రీయుతులు తుర్లపాటి నాగభూషణరావు గారు నిర్వహించిన 90 ఏళ్ళ తెలుగు టాకీ పట్టాభిషేకం 90 రోజుల మెగా ఈవెంట్ (2022 ఆగస్టు 15 నుండి నవంబరు 12 వరకు) లో ఘంటసాల గానసభ, హైదరాబాద్ వ్యవస్థాపకులు డా. కె.వి. రావు గారు మాట్లాడుతూ ఈ అభ్యుదయ సినీ కవుల జంట గుఱించి క్రింది వీడియోలో తెలిపారు. వారి సంభాషణ అనంతరం ప్రముఖ గాయనీ గాయకులు శ్రీమతి అఖిల గారు (హైదరాబాదు), శ్రీ కృష్ణకీర్తి గారు (అమెరికా) సుంకర - వాసిరెడ్డి వ్రాసిన, మాస్టారు బాణీ కట్టిన మరియు గానం చేసిన కొన్ని గీతాలను ఆలపించారు.
~ ఘంటసాల మాస్టారు పాడిన లేదా బాణీ కట్టిన సుంకర - వాసిరెడ్డి రచనలు ~
| # | పాట | రీతి | సినిమా | సం | రచన | గానం | సంగీతం |
|---|---|---|---|---|---|---|---|
| 1 | ఆ మనసులోన | (ఏ) | పల్లెటూరు | 1952 | సుంకర, వాసిరెడ్డి | ఘంటసాల | ఘంటసాల |
| 2 | అమ్మా సీతమ్మా | (సా) | పల్లెటూరు | 1952 | సుంకర, వాసిరెడ్డి | ఘంటసాల | ఘంటసాల |
| 3 | ఆపదల పాలైతివా | (ఏ) | పల్లెటూరు | 1952 | సుంకర, వాసిరెడ్డి | ఘంటసాల | ఘంటసాల |
| 4 | వచ్చిందోయి సంక్రాంతి | (బ) | పల్లెటూరు | 1952 | సుంకర, వాసిరెడ్డి | ఘంటసాల, ఎం.ఎస్.రామారావు,టి.జి.కమలాదేవి | ఘంటసాల |
| 5 | ఆ సంక్రాంతికి | (బృం) | పల్లెటూరు | 1952 | సుంకర, వాసిరెడ్డి | ఘంటసాల, ఎం.ఎస్.రామారావు,బృందం | ఘంటసాల |
| 6 | ఆంధ్రుడా లేవరా | (బృం) | పల్లెటూరు | 1952 | సుంకర, వాసిరెడ్డి | ఘంటసాల, బృందం | ఘంటసాల |
| 7 | ఓ మిఠారి దిల్ కఠారి | (యు) | పల్లెటూరు | 1952 | సుంకర, వాసిరెడ్డి | ఘంటసాల, టి.జి.కమలాదేవి | ఘంటసాల |
| 8 | రామహరే శ్రీరామహరే | (బృం) | పల్లెటూరు | 1952 | సుంకర, వాసిరెడ్డి | ఘంటసాల. బృందం | ఘంటసాల |
| 9 | ఆశ నిరాశైపోయినది | (ఏ) | పల్లెటూరు | 1952 | సుంకర, వాసిరెడ్డి | పి.లీల | ఘంటసాల |
| 10 | కోరినదిస్తాడు అన్నయ్య | (ఏ) | పల్లెటూరు | 1952 | సుంకర, వాసిరెడ్డి | బేబీ కృష్ణవేణి | ఘంటసాల |
| 11 | దేశసేవకుల హృదయం | (ఏ) | పల్లెటూరు | 1952 | సుంకర, వాసిరెడ్డి | పి.లీల | ఘంటసాల |
| 12 | రాజునురా నే రాజునురా | (యు) | పల్లెటూరు | 1952 | సుంకర, వాసిరెడ్డి | పి.లీల,బేబీ కృష్ణవేణి | ఘంటసాల |
| 13 | తెలుసుకోండి దీని మహిమ | (ఏ) | జ్యోతి | 1954 | సుంకర | ఘంటసాల | పెండ్యాల |
| 14 | ఏది నిజం ఏది నిజం | (ఏ) | ఏది నిజం? | 1956 | సుంకర | ఘంటసాల, మాధవపెద్ది, బృందం | మాస్టర్ వేణు |
కృతజ్ఞతలు -
1. ఈ వ్యాసానికి సంబంధించిన ఛాయా చిత్రాలను, యూట్యూబ్ శృంఖలాన్ని అందించిన డా. కె.వి. రావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు,
2. వ్యాసానికి సంబంధించిన అదనపు సమాచారం వికీపీడియా ద్వారా గ్రహించడమైనది, వికీపీడియా వారికి కృతజ్ఞతలు.
3. ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి