6, ఆగస్టు 2026, గురువారం

వయారి భామ (1953) చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పాడిన పాటలు

 

1953 లో పెందుర్తి సుబ్బారావు గారు 'అజంతా' బ్యానర్‌పై స్వయంగా దర్శకత్వం వహిస్తూ వయ్యారిభామ” అనే జానపద చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ఆయన భార్య సులోచన వాంప్ పాత్రలో నటించారు. నిజానికి ఇదే సినిమా టైటిల్ పాత్ర.  ఈ చిత్రానికి కథ, మాటలు: ఆత్రేయ మరియు 'చంద్రకాంత్' కలిసి అందించారు. ఆత్రేయ ఒక పాట రాయగా, మిగిలిన అన్ని పాటలను సముద్రాల సీనియర్ రచించారు. ఈ చిత్రంతోనే ప్రసిద్ధ 'సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకునిగా – సముద్రాల రచయిత గా చక్కని ఒక కాంబినేషన్‌కి శ్రీకారం చుట్టబడింది. అప్పట్లో హిట్ జంటగా పేరుపొందిన అక్కినేని నాగేశ్వరరావు మరియు ఎస్. వరలక్ష్మి నాయికా నాయకులు. వీరు కాక ఇతర నటులు  సి.ఎస్.ఆర్., సులోచన, కోడూరి అచ్చయ్య, రావులపల్లి, వంగర, ఈశ్వర్ లాల్, సీతారామయ్య, మాస్టర్ రాజి, సురభి కమల, విజయ, గంగారత్నం, అన్నపూర్ణ తదితరులు. నేపథ్య గానం: ఘంటసాల, పార్థసారథి, జిక్కి, గానసరస్వతి, ఎస్. వరలక్ష్మి మొదలైన వారు. వీటిలో ఘంటసాల మాస్టారు రెండు పాటలు పాడారు. కాని ఆ గీతాలు ప్రస్తుతం అలభ్యం.

~ చిత్ర వివరాలు ~
చిత్రం#విడుదలనిర్మాణంచిత్రంసంగీతంనిర్మాతదర్శకుడు
3506.06.1953అజంతా వారివయారి భామసాలూరుఎస్.లక్ష్మీనారాయణ, పి.సుబ్బారావుపి.సుబ్బారావు
~ పాటల వివరాలు ~
#పాట/పద్యం పేరుతీరు రచనపాడినవారుఅభినయం
1రాగము రానీయవే (అ)(ఏ)సముద్రాల సీ.ఘంటసాలఅక్కినేని
2రావయ్యా అయ్యా రావయ్యా (అ)(ఏ)సముద్రాల సీ.ఘంటసాలఅక్కినేని
                                    అ - అలభ్యం; ఏ - ఏకగళం

కృతజ్ఞతలుః చిత్ర విశేషాలను శ్రీ కొల్లూరి భాస్కర రావు గారి ఘంటసాల గళామృతము పాలవెల్లి, శ్రీ చల్లా సుబ్బారాయుడు గారి "శతాబ్ది గాయకుడు ఘంటసాల" పుస్తకము నుండి, మరియు డా. వి.వి. రామారావు గారు సంకలనం చేసిన జీవితమే సఫలము - రెండవ సంపుటి నుండి గ్రహించడమైనది. వారందరికి హృదయపూర్వక ధన్యవాదాలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి