1950 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
1950 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, నవంబర్ 2025, మంగళవారం

స్వప్న సుందరి (1950) చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పాడిన పాటలు

1950లో ప్రతిభా ప్రొడక్షన్స్ బ్యానర్పై ఘంటసాల బలరామయ్య నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రం స్వప్న సుందరి. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు మరియు అంజలి దేవి నటించారు, సి.ఆర్. సుబ్బురామన్ మరియు ఘంటసాల సంయుక్తంగా సంగీతం అందించారు. చిత్రం టైటిల్స్ లో ఘంటసాల మాస్టారి పేరును జి.వి. రావుగా ప్రకటించారు.  అక్కినేని తొలుత బాలరాజు, కీలుగుఱ్ఱం వంటి జానపద చిత్రాలలో నటించి గొప్పపేరు తెచ్చుకోవడం తో, ఘంటసాల బలరామయ్య తను నిర్మించే జానపద చిత్రంలో అక్కినేనిని నాయకునిగా ఎన్నుకున్నారు. ఇతర పాత్రలలో జి. వరలక్ష్మి, కస్తూరి శివరావు, ముక్కామల కృష్ణమూర్తి, సురభి బాల సరస్వతి నటించారు. మాటలు, పాటలు సముద్రాల రాఘవాచార్యులు అందించారు,  చిత్రం కాశీ మజిలీ కథలు ఆధారంగా రూపొందించబడింది మరియు అదే పేరుతో తమిళంలో కూడా డబ్ చేయబడింది. ఘంటసాల మాస్టారు నాలుగు పాటలతో పాటు పతాక సన్నివేశంలో 'కాదోయి వగకాడా కలకాదోయి' అనే బిట్ ఆర్.బాలసరస్వతి తో పాడారు.

~సినిమా వివరాలు ~

చిత్రం#విడుదల నిర్మాణంచిత్రంసంగీతంనిర్మాత & దర్శకుడు
2009.11.1950ప్రతిభా వారిస్వప్నసుందరిసి.ఆర్.సుబ్బురామన్ఘంటసాల బలరామయ్య
~పాటల వివరాలు ~
#పాట/పద్యం/శ్లోకంతీరు రచనపాడినవారుఅభినయం
1సాగుమా సాహిణి(ఏ)సముద్రాల సీ.ఘంటసాలఅక్కినేని
2నిజమాయే కల నిజమాయే(ఏ)సముద్రాల సీ.ఘంటసాలఅక్కినేని
3ఈ సీమ వెలసిన హాయి(యు)సముద్రాల సీ.ఘంటసాల, ఆర్.బాలసరస్వతిఅక్కినేని, అంజలీదేవి
4కానగనైతినిగా నిన్ను(యు)సముద్రాల సీ.ఘంటసాల, ఆర్.బాలసరస్వతిఅక్కినేని, అంజలీదేవి
5కాదోయి వగకాడా (బిట్)(యు)సముద్రాల సీ.ఘంటసాల, ఆర్.బాలసరస్వతిఅక్కినేని, అంజలీదేవి

వాలి సుగ్రీవ (1950) చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పాడిన పాటలు

 

అశోకా పిక్చర్స్ పతాకంపై 1950 లో ఎస్.భావనారాయణ నిర్మించిన, జంపన చంద్రశేఖరరావు దర్శకత్వం వహించిన చిత్రం 'వాలి సుగ్రీవ'. చిత్రంలో తారాగణం చిలకలపూడి సీతారామాంజనేయులు (సి.ఎస్.ఆర్.), శ్రీరంజని, జి.వరలక్ష్మి, ఎస్.వరలక్ష్మి మొదలగు వారు. ఈ చిత్రానికి సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వరరావు, మాస్టర్ వేణు, పెండ్యాల, గాలిపెంచల మరియు ఘంటసాల. ఈ చిత్రంలో గాయనీగాయకులు జి.వరలక్ష్మి , ఎం ఎస్.రామారావు, ఎస్ సుందరమ్మ, ఎస్.రాజేశ్వరరావు, మాస్టర్ వేణు, ఘంటసాల, ఎస్ వరలక్ష్మి, సౌమిత్రి, కె.బాలసరస్వతి. మొత్తం పాటలలో 15 పాటలున్నాయి ఈ చిత్రంలో. వాటిలో ఘంటసాల మాస్టారు రెండు పాటలు పాడారు అందులో ఒకటి ఎస్. రాజేశ్వర రావు గారు, వేరొకటి ఘంటసాల మాస్టారు బాణీ కట్టారు. ఈ పాటల ఆడియోలు మరియు వీడియోలు ప్రస్తుతం అలభ్యం. వాటి సాహిత్యం లభ్యం. సాహిత్యాన్ని సేకరించి అందించిన శ్రీ చల్లా సుబ్బారాయుడు గారికి ధన్యవాదాలు.

~సినిమా వివరాలు~
చిత్రం#  విడుదల నిర్మాణంచిత్రంసంగీతంనిర్మాతదర్శకుడు       
1819.01.1950        అశోకా పిక్చర్స్    వాలి సుగ్రీవసాలూరు, పెండ్యాల, గాలిపెంచల, మాస్టర్ వేణు, ఘంటసాలఎస్. భావనారాయణజంపన

~పాటల వివరాలు -

#పాట/పద్యం/శ్లోకంతీరు రచనపాడినవారుసంగీతంఅభినయం
1కళావిలాసము ప్రేమే(యు)జంపనఘంటసాల, ఎస్.వరలక్ష్మిసాలూరుతెలియదు
2బ్రతుకే నిరాశ వలపు లేక(యు)జంపనఘంటసాల, ఆర్.బాలసరస్వతిఘంటసాలతెలియదు

అ - అలభ్యం, యు - యుగళగీతం