3, నవంబర్ 2025, సోమవారం

రత్నమాల (1948) చిత్రం కోసం ఘంటసాల పాటలు

శ్రీమతి పి.భానుమతి మరియు ఆమె భర్త పి. రామకృష్ణలు భరణీ చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. వారు ఈ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం "రత్నమాల". ఈ చిత్రానికి సంగీత దర్శకులు సి.ఆర్.సుబ్బురామన్. ఘంటసాల మాస్టారు సుబ్బురామన్ వద్ద సహాయకునిగా పని చేసేవారు. ఘంటసాల మాస్టారు ఈ చిత్రంలో  - ఘంటసాల, బృందం పాడిన "ఓరందగాడా ఓబులేశ", సి.ఎస్.ఆర్. ఆంజనేయులు పాడిన "ఆగవే మరదలా!", మరియు ఉడతా సరోజిని పాడిన "దారే తెలియదాయె అమ్మా" అనే మూడు పాటలకు బాణీలు కూర్చారని మిత్రులు శ్రీ చల్లా సుబ్బారాయుడు గారు వారి "శతాబ్ది గాయకుడు ఘంటసాల" పుస్తకంలో ఉటంకించారు.  ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, పి.భానుమతి, డా. గోవిందరాజుల సుబ్బారావు, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, హేమలత, అరణి నటించారు.

XXX

చిత్రం#విడుదలనిర్మాణంచిత్రంసంగీతంనిర్మాతదర్శకుడు
602.01.1948భరణీ పిక్చర్స్రత్నమాలసి.ఆర్.సుబ్బురామన్పి. రామకృష్ణపి. రామకృష్ణ


#పాట/పద్యం/శ్లోకంతీరు రచనపాడినవారుActor
1ఓరందగాడ ఓబులేశ*(బృం)సముద్రాల సీ.ఘంటసాల, బృందందొంగలముఠా నటులు
2ఆయే గౌరీ పరమేశుల (అ)(యు)సముద్రాల సీ.ఘంటసాల, పి.భానుమతిఅక్కినేని, భానుమతి
3ఓహో నా ప్రేమధారా (అ)(యు)సముద్రాల సీ.ఘంటసాల, పి.భానుమతిఅక్కినేని, భానుమతి
4దారే తెలియదాయె అమ్మా (అ)*(ఏ)సముద్రాల సీ.ఉడతా సరోజినిబేబి సుమిత్ర
5ఆగవే మరదలా (అ)*(ఏ)సముద్రాల సీ.సి.ఎస్.ఆర్.సి.ఎస్.ఆర్.

*ఈ పాటలను ఘంటసాల మాస్టారు స్వరపరిచారు (చల్లా సుబ్బారాయుడు - 'శతాబ్దిగాయకుడు ఘంటసాల' ఆధారంగా)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి