1946లో ఆర్.యస్.జునార్కర్ నిర్మించిన ‘నీరా ఔర్ నందా’ అనే హిందీ చిత్రాన్ని 1950లో నవీనా ఫిలిమ్స్ వారు జగన్నాథ్ పర్యవేక్షణలో ‘ఆహుతి’ పేరుతో అనువదించడంతో తెలుగులో అనువాద చిత్ర నిర్మాణశకం ఆరంభమయింది. ఆహుతి చిత్రానికి మాటలు పాటలు రాసే అవకాశం శ్రీశ్రీకి లభించింది. అలా సినీ రచయితగా తన పేరు తెరకెక్కించిన తొలి చిత్రం ఆహుతియేనని, అదే తన సినీ రచనకు పునాది వేసిందని శ్రీశ్రీయే స్వయంగా రాశారు."
~ సినిమా వివరాలు ~
| చిత్రం# | విడుదల | నిర్మాణం | చిత్రం | సంగీతం | నిర్మాత | దర్శకుడు |
|---|---|---|---|---|---|---|
| 19 | 22.06.1950 | నవీనా ఫిల్మ్స్ | ఆహుతి(డ) | ఎస్. రాజేశ్వరరావు | జగన్నాథ్ | ఆర్.ఎస్.జున్నాకర్ |
~ పాటల వివరాలు ~
| # | పాట/పద్యం/శ్లోకం | తీరు | రచన | పాడినవారు | అభినయం |
|---|---|---|---|---|---|
| 1 | ఓ ప్రియబాలనురా | (యు) | శ్రీశ్రీ | ఘంటసాల,ఆర్.బాలసరస్వతి | తెలియదు |
| 2 | జనన మరణలీలా | (యు) | శ్రీశ్రీ | ఘంటసాల,ఆర్.బాలసరస్వతి | తెలియదు |
| 3 | పున్నమి వచ్చినది (అ) | (యు) | శ్రీశ్రీ | ఘంటసాల,ఆర్.బాలసరస్వతి | తెలియదు |
| 4 | హంసవలె ఓ పడవ | (యు) | శ్రీశ్రీ | ఘంటసాల,ఆర్.బాలసరస్వతి | తెలియదు |
| 5 | ప్రేమయే జననమరణలీల (అ) | (యు) | శ్రీశ్రీ | ఘంటసాల,ఆర్.బాలసరస్వతి | తెలియదు |
అ - అలభ్యం, యు - యుగళగీతం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి