7, జనవరి 2026, బుధవారం

ఏకవీర (1969) చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పాడిన పాటలు, పద్యాలు

 

కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ తెలుగులో తొలి జ్ఞానపీఠ్ పురస్కారాన్ని "రామాయణ కల్ప వృక్షము" అన్న రచనకు అందుకున్నారు. విశ్వనాథ వారు సాహితీ ప్రక్రియలలో ఉపయోగించని ప్రయోగము లేదు.  వారికి ఎంతో సంతృప్తి తెచ్చిన రచన "రామాయణ కల్పవృక్షం" అయితే బహుళ జనాదరణను తెచ్చిన రచన వేయిపడగలు.  వారు మదురై ప్రాంతపు నేపథ్యం లో  వ్రాసిన నవల ఏకవీర. దీనిని తెలుగులో అదే పేరుతో ఏకవీర చలనచిత్రం గా రూపొందించారు. అయితే ఈ చిత్రానికి మాటలు, పాటలు  వ్రాసినది మరొక జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత సి.నారాయణ రెడ్డి. సినారె వ్రాసిన "విశ్వంభర" పద్య కావ్యానికి యీ పురస్కారం లభించింది. ఇందులో ఇద్దరు ఆప్తమిత్రులు ప్రతికూల పరిస్థితులలో ఒకరు ప్రేమించిన ప్రేయసిని వేరొకరు పెండ్లాడడం జరిగి విపరీతమైన మానసిక సంఘర్షణకు లోనవుతారు. ఈ ఇరు జంటల ప్రేమ కథలో కలిగే అనూహ్య పరిణామాలకు ఫలితంగా విషాదాంతమైన ఈ చిత్రానికి జనాదరణ లబించలేదు. 


~ చిత్రం వివరాలు ~

చిత్రం#విడుదల నిర్మాణంచిత్రంసంగీతంనిర్మాతదర్శకుడు
 4.12.1969పద్మా ఫిలింస్ఏకవీరకె.వి. మహదేవన్డి.ఎల్. నారాయణ, బి.ఎ.సీతారాంసి.ఎస్. రావు

~ పాటల వివరాలు ~

#పాట/పద్యం/శ్లోకంతీరు రచనపాడినవారుఅభినయం
1వందనము జననీ భవాని (ప)దేవులపల్లిఘంటసాలధూళిపాళ
2తోటలో నా రాజు (యు)డా.సినారెఘంటసాల, పి.సుశీలఎన్.ట్.ఆర్., జమున
3ప్రతీ రాత్రి వసంతరాత్రి(యు)దేవులపల్లిఘంటసాల, ఎస్.పి.బాలుఎన్.ట్.ఆర్., కాంతారావు
4కనుదమ్ములను మూసి(ప)డా.సినారెఘంటసాలఎన్.ట్.ఆర్.
5ఒక దీపం వెలిగింది (యు)డా.సినారెఘంటసాల, పి.సుశీలఎన్.ట్.ఆర్., కె.ఆర్.విజయ
6ఓం అసతో మా సద్గమయ(శ్లో)సాంప్రదాయఘంటసాలనేపథ్యగానం

ప - పద్యం, యు - యుగళగీతం, శ్లో - శ్లోకం,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి