![]() |
| విడుదలః ఫిబ్రవరి 19, 1949 |
1949
సంవత్సరంలో విడుదలైన శోభనాచల సంస్థ నిర్మించిన చిత్రం జానపద చిత్రం కీలుగుఱ్ఱం. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, ఎ.వి.సుబ్బారావు, రేలంగి, మహంకాళి వెంకయ్య, కంచి నరసింహారావు, టి.కనకం, బాలామణి, సూర్యశ్రీ, జూనియర్ లక్ష్మిరాజ్యం, సురభి కమలాబాయి, గంగారత్నం మొదలగువారు. ఈ చిత్రానికి నిర్మాత మరియు దర్శకుడు మీర్జాపురం రాజా. ఈ చిత్రంలో పాటలన్నీ తాపీ ధర్మారావు నాయుడు వ్రాసారు. ఒక్క
పాట తప్ప, అన్ని పాటలకు సంగీతదర్శకత్వం ఘంటసాల మాస్టారు. మాస్టారు సంపూర్ణంగా సంగీత దర్శకత్వం వహించిన తొలి
తెలుగు చిత్రమిది. తొలినాటి నాటకాలలో వినిపించే పద్యాల ఆలాపనకు భిన్నంగా ఘంటసాల మాస్టారు
పద్యగాయనానికి తనదంటూ ఒక ప్రత్యేయ ఒరవడిని తెలుగు చిత్రాలలో ప్రయోగించారు. ఈ చిత్రంలో
మాస్టారు ఆలపించిన “పూనిక రాజవంశమున పుట్టిన కన్య” అనే పద్యం తెలుగు చలనచిత్ర సీమలో
మాస్టారి మొదటి పద్యం. శోభనాచల స్టూడియో బేనర్ పాటకు టి.ఎ. మోతీ సంగీతం సమకూర్చారు,
సి.కృష్ణవేణి పాడారు. మీర్జాపురం రాజుగారి సతీమణి మరియు నటి, గాయకురాలైన సి.కృష్ణవేణి
కొన్ని ఏకగళ గీతాలు, ఘంటసాల మాస్టారితో ఒక యుగళగీతం ‘తెలియవశమా పలుకగలమా’ పాడారు. ఈ
చిత్రంలో మాస్టారు వక్కలంక సరళతో పాడిన ‘కాదు సుమా కల కాదుసుమా’ బహుళ ప్రాచుర్యం పొందింది.
మరొక గాయని శ్రీదేవితో ఘంటసాల మాస్టారు ‘ఎంత కృపామతివే భవానీ’ అనే యుగళగీతం పాడారు.
| Movie# | నిర్మాణం | చిత్రం | సంవత్సరం | సంగీతం | నిర్మాత | దర్శకత్వం |
|---|---|---|---|---|---|---|
| #9 | శోభనాచల | కీలుగుఱ్ఱం | 1949 | ఘంటసాల | మీర్జాపురం రాజా | మీర్జాపురం రాజా |
కీలుగుఱ్ఱం (1949) చిత్రం పాటల వివరాలు
| # | పాట/పద్యం | తీరు | రచన | గానం | అభినయం |
|---|---|---|---|---|---|
| 1 | తెలియవశమా పలుకగలమా | (యు) | తాపీ ధర్మారావు | ఘంటసాల, సి.కృష్ణవేణి | ఎ.వి.సుబ్బారావు, అంజలీదేవి |
| 2 | ఎంత కృపామతివే భవాని | (యు) | తాపీ ధర్మారావు | ఘంటసాల శ్రీదేవి | అక్కినేని, సూర్యశ్రీ |
| 3 | కాదుసుమా కలకాదుసుమా | (యు) | తాపీ ధర్మారావు | ఘంటసాల, వి.సరళ | అక్కినేని, సూర్యశ్రీ |
| 4 | మన కాళి శక్తికి మన | (బృం) | తాపీ ధర్మారావు | ఘంటసాల, బృందం | లింగం సుబ్బారావు, తదితరులు |
| 5 | గాలికన్నా కోలకన్నా | (ఏ) | తాపీ ధర్మారావు | ఘంటసాల | ఎం.కొండయ్య |
| 6 | ఎవరు చేసిన ఖర్మ | (ఏ) | ఇనుగంటి శోభనాద్రిరావు | ఘంటసాల | కె.వి.మాణిక్యరావు |
| 7 | పూనిక రాజ వంశమున | (ప) | తాపీ ధర్మారావు | ఘంటసాల | నేపథ్యగీతం |
| 8 | అమ్మ కావుమమ్మా మమ్ము | (ఏ) | తాపీ ధర్మారావు | పి.లీల | బాలామణి |
| 9 | ఆహా ఓహో ఎంతానందంబాయె | (ఏ) | తాపీ ధర్మారావు | వి.సరళ | జూనియర్ లక్ష్మీరాజ్యం |
| 10 | చూచి తీరవలదా | (ఏ) | తాపీ ధర్మారావు | సి.కృష్ణవేణీ | అంజలీదేవి |
| 11 | చెంపవేసి నాకింపు చేసితివి | (యు) | తాపీ ధర్మారావు | రేలంగి, టి.కనకం | రేలంగి, కనకం |
| 12 | దిక్కు తెలియదేమి సేతు | (ఏ) | ఇనుగంటి శోభనాద్రిరావు | పి.లీల | బాలామణి |
| 13 | నిదురబో నాయన్న | (ఏ) | ఇనుగంటి శోభనాద్రిరావు | పి.లీల | అక్కినేని |
| 14 | భాగ్యము నాదేనోయీ | (ఏ) | తాపీ ధర్మారావు | సి.కృష్ణవేణి | అక్కినేని |
| 15 | మము బ్రోవవే నూతా | (ఏ) | తాపీ ధర్మారావు | పి.లీల | బాలామణి |
| 16 | మోహనమహా హా | (ఏ) | తాపీ ధర్మారావు | సి.కృష్ణవేణి | అంజలీదేవి |
| 17 | శోభనగిరి నిలయా* | (ఏ) | తాపీ ధర్మారావు | సి.కృష్ణవేణి | అక్కినేని |
పొందుపరచిన లింకులపై క్లిక్ చేసి పాట/పద్యం/శ్లోకం యొక్క ఆడియో/వీడియోలను సాహిత్యాన్ని న "ఘంటసాల" బ్లాగ్ లో చూడగలరు.
(ఏ): ఏకగళం, (యు): యుగళం, (బ): బహుగళం, (బృం): బృందగీతం, (ప): పద్యం, (సం.ప.): సంవాద పద్యాలు, (దం): దండకం, (శ్లో): శ్లోకం, (బు): బుర్రకథ, (హ): హరికథ, (నా): నాటకము; (స్తు): స్తుతి; (స్తో): స్తోత్రం, (అ): అలభ్యం; (తె): తెలియదు, సు: సుప్రభాతం, సాం.శ్లో: సాంప్రదాయ శ్లోకం,
DISCLAIMER: ఈ చలనచిత్ర వివరాలను నా "ఘంటసాల గానపద సూచిక" ప్రారంభ పుటలో పేర్కొన్న వివిధ వనరుల నుండి సేకరించడమైనది. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది పూర్తిగా దోషరహితము కాదని మనవి. ఏవైనా సూచనలు, సవరణలు వుంటే దయచేసి కామెంట్లలో తెలుపగలరు. లేదా నా email - suryvulimiri@gmail కు పంపగలరు. This information is provided for entertainment and educational purpose only and no commercial purpose is being intended.
ఘంటసాల గానపదసూచిక (HOME)
ఘంటసాల బ్లాగు (HOME)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి