1, నవంబర్ 2025, శనివారం

త్యాగయ్య (1946) - చిత్రంలో ఘంటసాల మాస్టారు

తెలుగు చలనచిత్ర రంగంలో తొలినాటి కథానాయకుడు, సంగీతజ్ఞుడు, గాయకుడు శ్రీ చిత్తూరు వి. నాగయ్య గారు శ్రీ రేణుకా ఫిలింస్ పతాకంపై ప్రముఖ కర్ణాటక సంగీత త్రయంలో ఒకరైన విద్వాంసుడు శ్రీ త్యాగరాజు జీవితం ఆధారంగా నిర్మించిన అపురూపమైన సంగీత భరిత చిత్రం "త్యాగయ్య".  ఈ చిత్రంలో 34 పాటలున్నాయి. అందులో 28 త్యాగరాజ కీర్తనలు కాగా, మిగిలిన పాటలను, మాటలను సముద్రాల రాఘవాచార్యులు (సీనియర్) సమకూర్చారు. ఈ చిత్రంలో పురందరదాసు రచించిన ఒక కన్నడ కృతిని, పాపనాశనం శివన్ వ్రాసిన ఒక తమిళ కృతిని (డి.కె. పట్టమ్మాళ్ గానం చేసిన), మరియు జె.ఎ. రహమాన్ గానం చేసిన ఒక హిందీ పాటను కూడ చేర్చారు.  ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు, మరియు సంగీత దర్శకుడు.


ఈ చిత్రంలో ఘంటసాల మాస్టారు త్యాగయ్య శిష్యునిగా కనిపిస్తారు. ఘంటసాల మాస్టారు బృందగీతాలలో గొంతు కలిపారని వికిపీడియాలో వివరించారు. అయితే వివరాలు లభ్యం కాలేదు. ఆ విధంగా ఘంటసాల మాస్టారు వారి గాత్రాన్ని ఈ చిత్రంలో ఉపయోగించారని తెలుస్తోంది.


చిత్రం#విడుదలనిర్మాణంచిత్రంసంగీతంనిర్మాతదర్శకుడు
325.10.1946శ్రీ రేణుకా ఫిల్మ్స్త్యాగయ్యనాగయ్యనాగయ్యనాగయ్య

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి