3, నవంబర్ 2025, సోమవారం

బాలరాజు (1948) చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పాడిన, బాణీ కూర్చిన పాటలు

ఘంటసాల బలరామయ్య గారు నిర్మాతగా, దర్శకునిగా 1948 లో విడుదలైన చిత్రం బాలరాజు. ఈ చిత్రం అక్కినేని నాగేశ్వరరావు, కస్తూరి శివరావులకు అనూహ్యమైన మలుపు తిప్పింది. ఈ చిత్రానికి సంగీతాన్ని గాలి పెంచల నరసింహారావు సమకూరిస్తే, వారికి సహాయకులుగా ఘంటసాల మాస్టారు, సి.ఆర్.సుబ్బురామన్ లు వ్యవహరించారు. చిత్రానికి పాటలు, మాటలు సముద్రాల రాఘవాచార్యులు సమకూర్చగా, మల్లాది రామకృష్ణ శాస్త్రి గీతరచన సహాయకులుగా వ్యవహరించారు. ఈ చిత్రంలో అక్కినేని చెలియా కనరావా పాటను స్వయంగా పాడారు. కాని తరువాత ఘంటసాల మాస్టారి కంచు కంఠంలో అదే పాటను విన్నతరువాత మాస్టారి పాటనే ఖాయం చేశారు. అందువలన ఇద్దరి వెర్షన్లు లభ్యమవుతాయి.

నటీనటులు - అక్కినేని, ఎస్.వరలక్ష్మి, అంజలీదేవి, కస్తూరి శివరావు, జి. సదాశివరావు

~ చిత్రం వివరాలు ~

చిత్రం#విడుదలనిర్మాణంచిత్రంసంగీతంనిర్మాతదర్శకుడు
726.02.1948ప్రతిభాబాలరాజుగాలిపెంచెలఘంటసాల బలరామయ్యఘంటసాల బలరామయ్య

ఈ చిత్రానికి గాలి పెంచల స్వరనిరేశకులైనప్పటికీ ఘంటసాల మాస్టారు కొన్ని పాటలకు స్వయంగా బాణీలు సమకూర్చారు.

~ పాటల వివరాలు ~

#పాట/పద్యం/శ్లోకంతీరు రచనసంగీతంపాడినవారుఅభినయం
1నవోదయం నవోదయం(యు) సముద్రాల సీ.    ఘంటసాలఘంటసాల, వి.సరళఅక్కినేని
2చెలియా కనరావా(ఏ)సముద్రాల సీ.గాలిపెంచెల  ఘంటసాలలింగం సుబ్బారావు, ఎస్.వరలక్ష్మి
3తేలి చూడుము హాయీ(యు)సముద్రాల సీ.గాలిపెంచెలఘంటసాల, ఎస్.వరలక్ష్మిఎస్.వరలక్ష్మి
4ఎవరినే నేనెవరినే(ఏ)సముద్రాల సీ.ఘంటసాలఎస్.వరలక్ష్మిఎస్.వరలక్ష్మి
5ఓ బాలరాజా ప్రేమే ఎరుగవా(ఏ)సముద్రాల సీ.ఘంటసాలఎస్.వరలక్ష్మిఅంజలీదేవి
6తీయని వెన్నెల రేయి(ఏ)సముద్రాల సీ.ఘంటసాలవి.సరళఎస్.వరలక్ష్మి
7రూపము నీయరయా(ఏ)సముద్రాల సీ.ఘంటసాలఎస్.వరలక్ష్మిఎస్.వరలక్ష్మి
8వరుణా వరుణా వర్షించ(ఏ)సముద్రాల సీ.ఘంటసాలఎస్.వరలక్ష్మిఎస్.వరలక్ష్మి
9రాజా రారా నా రాజా(ఏ)సముద్రాల సీ.ఘంటసాలఎస్.వరలక్ష్మిఎస్.వరలక్ష్మి

కృతజ్ఞతలు
: ఈ చిత్రపు విశేషాలు, పాటల వివరాలు తాను సంకలనం చేసిన "శతాబ్ది గాయకుడు - ఘంటసాల" పుస్తకం ద్వారా తెలిపిన మిత్రులు శ్రీ చల్లా సుబ్బారాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.



 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి