3, నవంబర్ 2025, సోమవారం

రక్షరేఖ చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పాడిన పాటలు

తమిళ సినిమా తొలి దశాబ్దాలలో ప్రముఖ చిత్రనిర్మాత, రంగస్వామి పద్మనాభన్ మూకీ సినిమాలతో తన వృత్తిని ప్రారంభించారు. ఈయన తమిళనాడులోని శివగంగకు చెందినవాడు. తొలుత చలనచిత్ర పరికరాల నిర్వహణ, చిత్రాల పంపిణీ మరియు ప్రదర్శనను నిర్వహిస్తుండేవాదు. తదుపరి అతను మద్రాసుకు వెళ్లి ట్రిప్లికేన్‌లో అసోసియేటెడ్ ఫిల్మ్ స్టూడియోస్‌ని స్థాపించాడు, అక్కడ తరువాత పారగాన్ థియేటర్ వచ్చింది. ఔత్సాహిక పద్మనాభన్ బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రాజా శాండోను బొంబాయి నుండి రప్పించి, అతనితో దర్శకుడిగా మరియు ప్రధాన నటుడిగా ఏడు మూకీ చిత్రాలను రూపొందించారు. తరువాతి రోజులలో తమిళ సినిమా డోయెన్‌, మొదట న్యాయవాదియై, తరువాత చలనచిత్ర నిర్మాతగా మారిన కె. సుబ్రహ్మణ్యంను తన మూకీ చిత్రాలలో ఒకదానికి స్క్రిప్ట్ రైటర్‌గా పరిచయం చేసాడు. టాకీలు వచ్చిన తర్వాత పద్మనాభన్ తమిళంలో పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. అతను తెలుగులో తన తొలి చిత్రం "రక్షరేఖ" కోసం సులభంగా విజయవంతం అవుతుందని ఊహించి జానపద కథను ఎంచుకున్నాడు.

కాశీ మజిలీ కథల ఆధారంగా నిర్మితమయిన రక్షరేఖ చిత్రానికి బలిజేపల్లి లక్ష్మీకాంతం కథను వ్రాయడంతో పాటు, పాటలను కూడ వ్రాసారు. ఈ చిత్రం లో నటీనటులు - అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, భానుమతి, వంగర వెంకట సుబ్బయ్య, కస్తూరి శివరావు, మొదలయినవారు.

చిత్రం#విడుదలనిర్మాణంచిత్రంసంగీతంనిర్మాతదర్శకుడు
1030.04.1949ఆర్.పద్మనాభన్ ప్రొడక్షన్స్రక్షరేఖఓగిరాల రామచంద్రరావుఆర్.పద్మనాభన్ఆర్.పద్మనాభన్

ఈ చిత్రంలో మొత్తం 16 పాటలు, పద్యాలున్నాయి. అందులో ఘంటసాల మాస్టారు మూడు పాటలు పాడారు. ఆ పాటల వివరాలు ఇలా వున్నాయి.

#పాట/పద్యం/శ్లోకంతీరు రచనసంగీతంపాడినవారుఅభినయం
1రామనామ సంకీర్తనమే(బృం)బలిజేపల్లిఓగిరాలఘంటసాల, బృందంఅక్కినేని, తదితరులు
2ఓ ఓహో రాజసుకుమారా(యు)బలిజేపల్లిఓగిరాలఘంటసాల, ఎ.పి.కోమలఅక్కినేని, అంజలీదేవి
3జీవనడోలీ మధుర జీవనకేళీ(యు)బలిజేపల్లిఓగిరాలఘంటసాల, పి.భానుమతిఅక్కినేని, భానుమతి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి