1950లో విడుదలైన శోభనాచల పిక్చర్స్ బ్యానర్ పై సి.కృష్ణవేణి నిర్మించిన తెలుగు సినిమా లక్ష్మమ్మ. ఈ చిత్రానికి త్రిపురనేని గోపీచంద్ కథ, చిత్రానువాదం, దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలలో చదలవాడ నారాయణరావు, సి.కృష్ణవేణి, ఇతర పాత్రలలో గోవిందరాజుల సుబ్బారావు, మాలతి, సులోచన, వంగర వెంకట సుబ్బయ్య నటించారు. ఈ చిత్రానికి ఘంటసాల మాస్టారు సంగీతాన్నందించారు. బాలాంత్రపు రజనీకాంత రావు పాటలు వ్రాసారు. పాటలను ఘంటసాల మాస్టారు, సి.కృష్ణవేణి, బెజవాడ రాజరత్నం, టి.జి. కమలాదేవి, ఎం.ఎస్. రామారావు గానం చేసారు. ఇదే కథతో, ఇదే సంవత్సరంలో వచ్చిన మరొక చిత్రం శ్రీ లక్ష్మమ్మ కథ. అందులో అక్కినేని, అంజలీదేవి, జి.వరలక్ష్మి, కస్తూరి శివరావు నటించారు. దీనికి నిర్మాత మరియు దర్శకులు ఘంటసాల బలరామయ్య, సంగీతం సి.ఆర్.సుబ్బురామన్ సమకూర్చారు.
~ చిత్రం వివరాలు ~
| చిత్రం# | విడుదల | నిర్మాణం | చిత్రం | సంగీతం | నిర్మాత | దర్శకుడు |
|---|---|---|---|---|---|---|
| 15 | 26.02.1950 | శోభనాచల & ఎం.ఆర్.ఏ. | లక్ష్మమ్మ | ఘంటసాల | సి.కృష్ణవేణి | గోపీచంద్ |
~ పాటల వివరాలు ~
| # | పాట/పద్యం/శ్లోకం | తీరు | రచన | పాడినవారు | అభినయం |
|---|---|---|---|---|---|
| 1A | తదీం ధీంత తననాం | (సా) | పి.సుబ్రహ్మణ్య అయ్యర్ | ఘంటసాల | పామర్తి |
| 1B | సుదతి నీకు తగిన చిన్నదిరా | (యు) | పి.సుబ్రహ్మణ్యఅయ్యర్ | ఘంటసాల, బెజవాడరాజరత్నం | పామర్తి, కుమారి రుక్మిణి |
| 2 | చిన్ననాటి స్వప్నసీమా | (యు) | బాలాంత్రపు | సి.కృష్ణవేణి తో | నేపథ్యగానం |
| 3 | పడినదారిని విడవబోకమ్మా | (ఏ) | బాలాంత్రపు | ఘంటసాల | నేపథ్యగానం |
| 4 | శ్రీకర శుభకర శ్రీ నారసింహా (అ) | (బు) | బాలాంత్రపు | ఘంటసాల, బృందం | తెలియదు |
| 5 | అమ్మా లక్ష్మమ్మా దేవతై | (బృం) | బాలాంత్రపు | ఘంటసాల, బృందం | వంగర, మద్దాలి కృష్ణమూర్తి |
| 6 | నేనే విరజాజినైతే నీవే | (యు) | బాలాంత్రపు | ఘంటసాల, బెజవాడరాజరత్నం | లక్ష్మీకాంత, సీత, ఇందిరాదేవి |
| 7 | అసతోమా సద్గమయా | (శ్లో) | వేదం-శాంతిమంత్రం | ఘంటసాల | నేపథ్యగానం |
| 8 | జోజోజో చిట్టినాతల్లీ | (ఏ) | బాలాంత్రపు | సి.కృష్ణవేణి | సి.కృష్ణవేణి |
| 9 | అమ్మా తులసి ప్రేమను | (బృం) | బాలాంత్రపు | సి.కృష్ణవేణి, బృందం | సి.కృష్ణవేణి |
| 10 | ఆశా హర్మ్యము కూలె | (ఏ) | బాలాంత్రపు | సి.కృష్ణవేణి | సి.కృష్ణవేణి |
| 11A | ఇటో ఆటో ఎటుపోవుటో | (ఏ) | బాలాంత్రపు | ఎం.ఎస్.రామారావు | సి.హెచ్.నారాయణరావు |
| 11B | ఈ నిర్వీర్య జీవితమ్ము | (సా) | బాలాంత్రపు | సి.కృష్ణవేణి | సి.కృష్ణవేణి |
| 12 | పలుకు లేదు పిలుపు | (ఏ) | బాలాంత్రపు | సి.కృష్ణవేణి | తెలియదు |
| 13 | ఊగాలోయి తద్ది ఉయ్యాలోయి | (బృం) | బాలాంత్రపు | సి.కృష్ణవేణి, బృందం | సి.కృష్ణవేణి తదితరులు |
| 14 | ఊయల ఊపనా సఖీ | (ఏ) | బాలాంత్రపు | సి.కృష్ణవేణి | సి.హెచ్.నారాయణరావు, సి.కృష్ణవేణి |
| 15 | ఏమనె ఏమేమనె | (ఏ) | బాలాంత్రపు | సి.కృష్ణవేణి | సి.కృష్ణవేణి |
| 16 | ఓహో కృష్ణా ఓహో కృష్ణా | (ఏ) | బాలాంత్రపు | టి.జి.కమలాదేవి | రుక్మిణి |
| 17 | అట్లతద్దోయ్ అట్లతద్దోయ్ (అ) | (బృం) | బాలాంత్రపు | బృందం | తెలియదు |
| 18 | ఏల విషాదము నాకేల (అ) | (ఏ) | బాలాంత్రపు | ఎం.ఎస్.రామారావు | సి.హెచ్.నారాయణరావు |
| 19 | వారిజముఖి నీవు (అ) | (తె) | బాలాంత్రపు | తెలియదు | రుక్మిణి |
| 20 | హృదయవీణ నా (అ) | (ఏ) | బాలాంత్రపు | తెలియదు | తెలియదు |
కృతజ్ఞతలుః చిత్రం యొక్క పాటల వివరాలను తన "శతాబ్ది గాయకుడు ఘంటసాల" గ్రంథంలో ప్రచురించి అందించిన శ్రీ చల్లా సుబ్బారాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి