శోభానాచల & బి. ఎ. సుబ్బారావు జాయింట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బి. ఎ. సుబ్బారావు నిర్మించి, దర్శకత్వం వహించిన 1950 భారతీయ తెలుగు భాషా చిత్రం “పల్లెటూరి పిల్ల”. ఇందులో N. T. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తొలిసారి కలసి నటించారు. కథానాయిక అంజలీ దేవి, P. ఆదినారాయణ రావు సంగీతం అందించారు. ఈ చిత్రంలో మొదట ఒక హీరో పాత్రకు కె. రఘురామయ్యను తీసుకున్నారు. కాని కారణాంతరాల వలన ఆయన తప్పుకోగా, అపుడూ అక్కినేనిని తీసుకున్నారు. ఈ చిత్రం రిచర్డ్ బ్రిన్స్లీషెరిడాన్ రచించిన పిజారో అనే ఆంగ్ల నాటకం ఆధారంగా రూపొందించబడింది.
మన దేశం (1949) చిత్రంలో చిన్న పాత్రలో (పోలీస్ ఇన్స్పెక్టర్) నటించిన రామారావుకి హీరోగా పల్లెటూరి పిల్ల మొదటి చిత్రం. ఇది బ్లాక్ బస్టర్ మరియు ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రం. ఈ చిత్రం నుండి బి.ఏ.సుబ్బారావు మరియు రామారావు ఇద్దరూ మంచి గుర్తింపు పొందారు. ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏమిటంటే బి.ఎ. సుబ్బారావు గారికి చలనచిత్ర దర్శకత్వంలో పూర్వానుభవం లేదు. ఆయన మీర్జాపురం రాజావారి శోభనాచల స్టూడియోలో ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసేవారు. ఆయన రాజుగారి ఆశీస్సులతో దర్శకత్వం చేసిన తొలి చిత్రం పల్లెటూరి పిల్ల. ఆ తర్వాత 14 చిత్రాలలో కలిసి నటించిన నాగేశ్వరరావు మరియు రామారావుల మధ్య మొదటి సహకారాన్ని కూడా ఈ చిత్రం సూచిస్తుంది. ఈ చిత్రం తమిళంలోకి “గ్రామ పెన్” గా డబ్ చేయబడింది, ఇది విజయవంతమైంది. ఇది తరువాత హిందీలో “ఇన్సానియత్” గా 1955 లో పునర్నిర్మించబడింది. ఈ చిత్రానికి పాటలు పి. ఆదినారాయణ మరియు తాపీ ధర్మారావు వ్రాసారు. ఘంటసాల మాస్టారు ఈ చిత్రానికి మూడు పాటలు పాడారు.
~ చిత్రం వివరాలు ~
| చిత్రం# | విడుదల | నిర్మాణం | చిత్రం | సంగీతం | నిర్మాత | దర్శకుడు |
|---|---|---|---|---|---|---|
| 17 | 27.04.1950 | శోభనాచల & బి.ఏ.సుబ్బారావు | పల్లెటూరి పిల్ల | పి.ఆదినారాయణరావు | మీర్జాపురం రాజా, బి.ఏ. సుబ్బారావు | బి.ఎ.సుబ్బారావు |
| # | పాట/పద్యం/శ్లోకం | తీరు | రచన | పాడినవారు | అభినయం |
|---|---|---|---|---|---|
| 1 | ప్రేమమయా చిత్రము | (ఏ) | తాపీ ధర్మారావు | ఘంటసాల | నేపథ్యగానం |
| 2 | ధన్యాత్మా జోహార్ | (ఏ) | తాపీ ధర్మారావు | ఘంటసాల | నేపథ్యగానం |
| 3 | శాంతవంటి పిల్ల లేదోయి | (ఏ) | ఆదినారాయణరావు | ఘంటసాల | అక్కినేని |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి