11, నవంబర్ 2025, మంగళవారం

సంసారం (1950) చిత్రానికి ఘంటసాల మాస్టారు పాడిన పాటలు

 

సాధన ప్రొడక్షన్స్ బ్యానర్పై L. V. ప్రసాద్ దర్శకత్వం వహించిన 1950 భారతీయ తెలుగు భాషా నాటక చిత్రం సంసారం. ఇందులో N. T. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు మరియు లక్ష్మీరాజ్యం నటించారు, సుసర్ల దక్షిణామూర్తి సంగీతం అందించారు. దీన్ని కె.వి.కృష్ణ, సి.వి.రంగనాథ దాసు నిర్మించారు. చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నమోదైంది. చిత్రం తరువాత తమిళంలో అదే పేరుతో హిందీలోసన్సార్” మరియు మలయాళంలోఅయోధ్య (1975) పేరుతో రీమేక్ చేయబడింది.

అమ్మాయి, అబ్బాయి పెళ్లి అనే బంధంతో భార్య, భర్త అనే కొత్త పాత్రలలో అడుగు పెట్టి సంసారం అనే కొత్త జీవితాన్ని కలసి ప్రారంభిస్తారు. అప్పటి వరకు బలాదూర్ గా తిరిగిన వారిరువురు బరువు బాధ్యతలను పంచుకోవడం మొదలు పెట్టి సంసారమనే సాగరాన్నిఈదే పనిలో పడతారు. అయితే అందరికీ ఈ ప్రయాణం సుగమం కాక పోవచ్చును. ఒడిదుడుకులు, ఆటుపోటులు, అపోహలు-అలకలు, అపార్ధాలు-అలజడులు, అలరింపులు-ఆదరింపులు, సాన్నిహిత్యం-సామరస్యం, సహజీవనం-సమ భావనం ఇవన్నీ కలబోసిన సంసారం అందులోని మాధుర్యం అందరం చవిచూస్తాం. 1950 లో ఎన్.టి.ఆర్., ఎ.ఎన్.ఆర్., లక్ష్మీ రాజ్యం, పుష్పలత నటించిన సాంఘిక చిత్రం సంసారం.  ఈ చిత్రంలో సావిత్రి ఒక చిన్న పాత్ర పోషించింది. ఎల్.వి.ప్రసాద్ దర్శకులు. సంసారపు లక్షణాలను, విలువలను చక్కగా వివరించారు సదాశివ బ్రహ్మం గారు.

~ చిత్రం వివరాలు ~

చిత్రం#విడుదల నిర్మాణంచిత్రంసంగీతంనిర్మాతదర్శకుడు
2129.12.1950సాధనాసంసారంసుసర్ల దక్షిణామూర్తికె.వి.కృష్ణఎల్.వి.ప్రసాద్

~ పాటల వివరాలు ~
#పాట/పద్యం/శ్లోకంతీరు రచనపాడినవారుఅభినయం
1సంసారం సంసారం(ఏ)సదాశివబ్రహ్మంఘంటసాలటైటిల్ సాంగ్
2అందాల చందమామ(ఏ)సదాశివబ్రహ్మంఘంటసాలఅక్కినేని
3టకుటకుటకు టమకుల(బృం)సదాశివబ్రహ్మంఘంటసాల, జిక్కీ, బృందంఅక్కినేని, పుష్పలత, సావిత్రి, బృందం
4దారుణమీ దరిద్రము(ప)సదాశివబ్రహ్మంఘంటసాలనేపథ్యగానం
ఏ - ఏకగళగీతం, బృఁబృందగీతం, ప - పద్యం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి