అశోకా పిక్చర్స్ పతాకంపై 1950 లో ఎస్.భావనారాయణ నిర్మించిన, జంపన చంద్రశేఖరరావు దర్శకత్వం వహించిన చిత్రం 'వాలి సుగ్రీవ'. ఈ చిత్రంలో తారాగణం చిలకలపూడి సీతారామాంజనేయులు (సి.ఎస్.ఆర్.), శ్రీరంజని, జి.వరలక్ష్మి, ఎస్.వరలక్ష్మి మొదలగు వారు. ఈ చిత్రానికి సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వరరావు, మాస్టర్ వేణు, పెండ్యాల, గాలిపెంచల మరియు ఘంటసాల. ఈ చిత్రంలో గాయనీగాయకులు జి.వరలక్ష్మి , ఎం ఎస్.రామారావు, ఎస్ సుందరమ్మ, ఎస్.రాజేశ్వరరావు, మాస్టర్ వేణు, ఘంటసాల, ఎస్ వరలక్ష్మి, సౌమిత్రి, కె.బాలసరస్వతి. మొత్తం పాటలలో 15 పాటలున్నాయి ఈ చిత్రంలో. వాటిలో ఘంటసాల మాస్టారు రెండు పాటలు పాడారు అందులో ఒకటి ఎస్. రాజేశ్వర రావు గారు, వేరొకటి ఘంటసాల మాస్టారు బాణీ కట్టారు. ఈ పాటల ఆడియోలు మరియు వీడియోలు ప్రస్తుతం అలభ్యం. వాటి సాహిత్యం లభ్యం. సాహిత్యాన్ని సేకరించి అందించిన శ్రీ చల్లా సుబ్బారాయుడు గారికి ధన్యవాదాలు.
| చిత్రం# | విడుదల | నిర్మాణం | చిత్రం | సంగీతం | నిర్మాత | దర్శకుడు |
|---|---|---|---|---|---|---|
| 18 | 19.01.1950 | అశోకా పిక్చర్స్ | వాలి సుగ్రీవ | సాలూరు, పెండ్యాల, గాలిపెంచల, మాస్టర్ వేణు, ఘంటసాల | ఎస్. భావనారాయణ | జంపన |
~పాటల వివరాలు -
| # | పాట/పద్యం/శ్లోకం | తీరు | రచన | పాడినవారు | సంగీతం | అభినయం |
|---|---|---|---|---|---|---|
| 1 | కళావిలాసము ప్రేమే | (యు) | జంపన | ఘంటసాల, ఎస్.వరలక్ష్మి | సాలూరు | తెలియదు |
| 2 | బ్రతుకే నిరాశ వలపు లేక | (యు) | జంపన | ఘంటసాల, ఆర్.బాలసరస్వతి | ఘంటసాల | తెలియదు |
అ - అలభ్యం, యు - యుగళగీతం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి