11, నవంబర్ 2025, మంగళవారం

స్వప్న సుందరి (1950) చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పాడిన పాటలు

1950లో ప్రతిభా ప్రొడక్షన్స్ బ్యానర్పై ఘంటసాల బలరామయ్య నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రం స్వప్న సుందరి. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు మరియు అంజలి దేవి నటించారు, సి.ఆర్. సుబ్బురామన్ మరియు ఘంటసాల సంయుక్తంగా సంగీతం అందించారు. చిత్రం టైటిల్స్ లో ఘంటసాల మాస్టారి పేరును జి.వి. రావుగా ప్రకటించారు.  అక్కినేని తొలుత బాలరాజు, కీలుగుఱ్ఱం వంటి జానపద చిత్రాలలో నటించి గొప్పపేరు తెచ్చుకోవడం తో, ఘంటసాల బలరామయ్య తను నిర్మించే జానపద చిత్రంలో అక్కినేనిని నాయకునిగా ఎన్నుకున్నారు. ఇతర పాత్రలలో జి. వరలక్ష్మి, కస్తూరి శివరావు, ముక్కామల కృష్ణమూర్తి, సురభి బాల సరస్వతి నటించారు. మాటలు, పాటలు సముద్రాల రాఘవాచార్యులు అందించారు,  చిత్రం కాశీ మజిలీ కథలు ఆధారంగా రూపొందించబడింది మరియు అదే పేరుతో తమిళంలో కూడా డబ్ చేయబడింది. ఘంటసాల మాస్టారు నాలుగు పాటలతో పాటు పతాక సన్నివేశంలో 'కాదోయి వగకాడా కలకాదోయి' అనే బిట్ ఆర్.బాలసరస్వతి తో పాడారు.

~సినిమా వివరాలు ~

చిత్రం#విడుదల నిర్మాణంచిత్రంసంగీతంనిర్మాత & దర్శకుడు
2009.11.1950ప్రతిభా వారిస్వప్నసుందరిసి.ఆర్.సుబ్బురామన్ఘంటసాల బలరామయ్య
~పాటల వివరాలు ~
#పాట/పద్యం/శ్లోకంతీరు రచనపాడినవారుఅభినయం
1సాగుమా సాహిణి(ఏ)సముద్రాల సీ.ఘంటసాలఅక్కినేని
2నిజమాయే కల నిజమాయే(ఏ)సముద్రాల సీ.ఘంటసాలఅక్కినేని
3ఈ సీమ వెలసిన హాయి(యు)సముద్రాల సీ.ఘంటసాల, ఆర్.బాలసరస్వతిఅక్కినేని, అంజలీదేవి
4కానగనైతినిగా నిన్ను(యు)సముద్రాల సీ.ఘంటసాల, ఆర్.బాలసరస్వతిఅక్కినేని, అంజలీదేవి
5కాదోయి వగకాడా (బిట్)(యు)సముద్రాల సీ.ఘంటసాల, ఆర్.బాలసరస్వతిఅక్కినేని, అంజలీదేవి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి