19, నవంబర్ 2025, బుధవారం

చంద్రవంక (1951) చిత్రం కోసం ఘంటసాల మాస్టారు బాణీ కట్టిన పాట

ఆనంద్ (నాళం ఆనందరావు), అహమ్మద్ పిక్చర్స్(AA Pictures) పతాకంపై నిర్మించిన చిత్రం చంద్రవంక. ఇది 1951 లో విడుదలైంది. ఈ చిత్రంలో నటీ నటులు కాంచన (నాళం ఆనందరావు భార్య), టి.జి. కమలాదేవి, కె.రఘురామయ్య, దాసరి కోటిరత్నం, నాళం ఆనందరావు మొదలగు వారు. ఈ చిత్రానికి దర్శకుడు జితేన్ బెనర్జీ, సంగీతదర్శకులు టి ఎ.కళ్యాణo, నాళం ఆనందరావు , ఘంటసాల మాస్టారు. ఈ చిత్రం కోసం 21 పాటలు కోపల్లె వెంకటరమణరావు వ్రాసారు. ఈ చిత్రానికి నేపథ్య గానం అందించినది జిక్కి, పి.లీల, దాసరి కోటిరత్నం, టి.జి. కమలాదేవి, జయలక్ష్మి, మరియు నటగాయకులు కె.రఘురామయ్య. 

చిత్రం#విడుదల నిర్మాణంచిత్రంసంగీతంనిర్మాత & దర్శకుడుదర్శకుడు
22       02.02.1951   ఎ.ఎ.పిక్చర్స్   చంద్రవంక  టి.ఎ.కల్యాణం, ఘంటసాల, నాళం నాగేశ్వరరావుఎ.ఎ.పిక్చర్సుజితెన్ బెనర్జీ

ఈ చిత్రానికి ముగ్గురు సంగీతదర్శకులు 21 పాటలను కంపోజ్ చేసారు. అందులో ఘంటసాల మాస్టారు పి.లీల పాడిన ఒకే ఒక పాటను కంపోజ్ చేసారని శ్రీ చల్లా సుబ్బారాయుడుగారి "శతాబ్ది గాయకుడు ఘంటసాల" పుస్తకం ద్వారా తెలిసింది.
 
Video link: Courtesy Sri Gorty V.S. Sastry & Dr. K.V. Rao, GGS Hyderabad

#పాట/పద్యం/శ్లోకంతీరు రచనసంగీతంపాడినవారుఅభినయం
1యువతి నేను యువకుడ నీవు(ఏ)కోపల్లిఘంటసాలపి.లీలజూనియర్ లక్ష్మీరాజ్యం, కె.రఘురామయ్య



Lyrics: With courtesy of Sri Challa Subbarayudu garu

ఘంటసాల మాస్టారు బాణీ కట్టిన, పి.లీల గానం చేసిన ఈ అరుదైన గీతాన్ని ఘంటసాల గాన సభ, హైదరాబాద్ మరియు ప్రసాద్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్వహించిన అలనాటి అందాలు, ఎపిసోడ్ - 13 లో మాస్టారి 98వ జయంతినాడు  ప్రముఖ గాయని అఖిల గారు అద్భుతంగా గానం చేసారు.  ఆ దృశ్యఖండికను పంచుకున్న ఘంటసాల గాన సభ, హైదరాబాద్ వ్యవస్థాపకులు డా.కె.వి. రావు - డా. కె. శారద దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు.

ఈ చిత్ర నిర్మాత నాళం నాగేశ్వరరావు గారు, తనూ, తన శ్రీమతి కాంచనతో నాయికానాయకులుగా ఈ చిత్రం నిర్మించ సంకల్పించి ఘంటసాల మాస్టారిని అడుగగా వారు అంగీకరించారట. కాని అనంతరం మనసు మార్చుకుని, తన బదులుగా అలనాటి ప్రముఖ నటగాయకుడు కె. రఘురామయ్యను హీరోగా నిర్మించారట. అయితే మాస్టారి యుగళగీతం ఈ చిత్రంలో వుందో లేదో తెలియదని మాస్టారి సతీమణి శ్రీమతి సావిత్రమ్మ గారు తెలిపారు.  అంతేకాక ముగ్గురు సంగీత దర్శకులున్న ఈ చిత్రానికి పాటల రికార్డులపై ఎవరు ఏ పాటలు కంపోజ్ చేసారో ఆ వివరాలు ప్రచురించబడలేదట.  పాట గతిని బట్టి "యువతి నేను యువకుడ నీవు" అనే పి.లీల పాడిన ఏకగళ గీతాన్ని ఘంటసాల మాస్టారు కంపోజ్ చేసివుండవచ్చని శ్రీ జె. మధుసూదన శర్మ గారు తెలిపారు.

ఈ పాట వివరాలను, సాహిత్యాన్ని తన "శతాబ్ది గాయకుడు ఘంటసాల" పుస్తకంలో ప్రచురించి, మాస్టారి ఆరాధకులకు, అభిమానులకు అందించిన శ్రీ చల్లా సుబ్బారాయుడు గారికి ప్రత్యేక అభినందనలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి