1959 లో విడుదలైన ఒక క్లాసిక్ తెలుగు చిత్రం భాగ్యదేవత. దీనిని అలనాటి ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన సారథీ స్టూడియోస్ అధినేత యార్లగడ్డ రామకృష్ణప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి తాపీ చాణక్య దర్శకత్వం వహించారు. ఇది విధి, ప్రేమ మరియు త్యాగం గురించిన కథ. ఇందులో కొంగర జగ్గయ్య, సావిత్రి, రాజసులోచన, సూర్యకాంతం, రేలంగి ప్రధాన పాత్రల్లో నటించారు. మాస్టర్ వేణు సంగీతం సమకూర్చారు. ఇది తెలుగు సినిమా చరిత్రలో ఒక ముఖ్యమైన చిత్రంగా నిలిచింది. దీనిని తమిళంలో భాగ్య దేవతైగా నిర్మించారు. ముఖ్యమైన విషయమేమిటంటే ఉభయభాషలలో దీన్ని హైదరాబాదులో నిర్మించారు. తమిళ చిత్రంలో జెమినీ గణేషన్ మరియు సావిత్రి నటించారు, ఈ చిత్రంలో మొత్తం తొమ్మిది పాటలున్నాయి. అందులో ఘంటసాల మాస్టారు రెండు యుగళగీతాలను, ఒకటి పి.సుశీలతో మరొకటి జమునారాణితోను, ఒక ఏకగళగీతాన్ని పాడారు.
~ చిత్రం వివరాలు ~
| చిత్రం# | విడుదల | నిర్మాణం | చిత్రం | సంగీతం | నిర్మాత & దర్శకుడు | దర్శకుడు |
|---|---|---|---|---|---|---|
| 157 | 23.10.1959 | శ్రీ సారథీ స్టూడియోస్ | భాగ్యదేవత | మాస్టర్ వేణు | సారథీ స్టూడియోస్ | తాపీ చాణక్య |
~ ఘంటసాల మాస్టారు పాడిన పాటల వివరాలు ~
| # | పాట/పద్యం/శ్లోకం | తీరు | రచన | పాడినవారు | అభినయం |
|---|---|---|---|---|---|
| 1 | వెతుకాడే కన్నులలోనా | (యు) | శ్రీశ్రీ | ఘంటసాల, జమునారాణీ | బాలయ్య, రాజసులోచన |
| 2 | మదిని హాయి నిండెగా | (యు) | శ్రీశ్రీ | ఘంటసాల, పి.సుశీల | జగ్గయ్య, సావిత్రి |
| 3 | హరేహరే రాం సీతారాం | (ఏ) | కొసరాజు | ఘంటసాల | రేలంగి |
యు - యుగళగీతం; ఏ - ఏకగళగీతం

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి