12, డిసెంబర్ 2025, శుక్రవారం

నిర్దోషి (1951) చిత్రం కోసం ఘంటసాల మాస్టారు కూర్చిన, పాడిన పాటలు

తొలి తెలుగు టాకీ చిత్రం “భక్తప్రహ్లాద” ను 1931 లో నిర్మించిన హెచ్.ఎం. రెడ్డి (హనుమప్ప మునియప్ప రెడ్డి) రోహిణీ బ్యానర్ మీద 1951లో నిర్మించి దర్శకత్వం వహించినన సాంఘిక చిత్రం నిర్దోషి. ఈ చిత్రంలో ముక్కామల, అంజలీదేవి, టి.ఎల్. కాంతారావు (వెండి తెరకు తొలి పరిచయం), జి.వరలక్ష్మి, లక్ష్మీకాంత,  కోన ప్రభాకరరావు నటించారు. అప్పటి వరకు ప్రతినాయక పాత్రలు ధరిస్తున్న ముక్కామల నాయకునిగా నటించడం విశేషం. ఈ చిత్రానికి ఘంటసాల మాస్టారు మరియు హెచ్.ఎం.పద్మనాభశాస్త్రి (హోస్పేట రామశేష పద్మనాభ శాస్త్రి) సంగీతదర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పాటలున్నాయి. అందులో నాలుగు అలభ్యం. ఘంటసాల మాస్టారు సుందరమ్మతో ఒక యుగళగీతం “స్వాగతం స్వాగతం” పాడారు. మరొక యుగళగీతం జిక్కీతో  “హృదయమె నీతి” లో మాస్టారు ఆలాపన చేసారు. ఈ చిత్రం ఆర్థికంగా పరాజయం పాలైంది.

~ చిత్రం వివరాలు ~

చిత్రం#విడుదల నిర్మాణంచిత్రంసంగీతంనిర్మాత & దర్శకుడు
2324.02.1951రోహిణీనిర్దోషిఘంటసాల, పద్మనాభశాస్త్రిహెచ్.ఎం.రెడ్డి

~ పాటల వివరాలు ~

#పాట/పద్యం/శ్లోకంతీరు రచనపాడినవారుఅభినయం
1స్వాగతం స్వాగతం(యు)కొండముది,శ్రీశ్రీఘంటసాల, సుందరమ్మముక్కామల, అంజలీదేవి
2హృదయమే నీతి ఈ జగతికి(యు)కొండముది,శ్రీశ్రీజిక్కీ, ఘంటసాల (ఆలాపన) అంజలీదేవి, ముక్కామల
3చూలాలు సీతమ్మ కానలకు(ఏ)కొండముది,శ్రీశ్రీమాధవపెద్దినేపథ్యగానం
4నేనే జాణగా నెరజాణగా(ఏ)కొండముది,శ్రీశ్రీజి.వరలక్ష్మిజి.వరలక్ష్మి
5లోకమయ్యా లోకము(ఏ)కొండముది,శ్రీశ్రీఎ.వి.సరస్వతిమధు
6లాలి లాలి చిన్నారి లాలి(ఏ)కొండముది,శ్రీశ్రీసుందరమ్మజి.వరలక్ష్మి
7సఖా నా రాజు నీవోయి(ఏ)కొండముది,శ్రీశ్రీజి.వరలక్ష్మిజి.వరలక్ష్మి
8ఆటలనాడుచూ (అ)(బ)కొండముది,శ్రీశ్రీటి.జి.సరస్వతి,భారతి,రోహిణిఅంజలీదేవి, తదితరులు
9గతిమాలిన బ్రతుకై పోయెనా (అ)(ఏ)కొండముది,శ్రీశ్రీసుందరమ్మఅంజలీదేవి
10నాగమల్లె సెట్టుకాడ (అ)(తె)కొండముది,శ్రీశ్రీతెలియదుకె.ప్రభాకరరావు
11హాయి హాయి హాయి (అ)(ఏ)కొండముది,శ్రీశ్రీజిక్కీఅంజలీదేవి

అ - అలభ్యం; ఏ - ఏకగళగీతం; బ - బహుగళ గీతం; తె - తెలియదు; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి