12, డిసెంబర్ 2025, శుక్రవారం

పాతాళ భైరవి (1951) చిత్రం కోసం ఘంటసాల మాస్టారు కూర్చిన, పాడిన పాటలు

 పాతాళ భైరవి 1951లో విడుదలైన బహుళ ప్రజాదరణ పొందిన ఒక చక్కని తెలుగు జానపద చిత్రం. దీనిని విజయా సంస్థ బ్యానర్ మీద నాగిరెడ్డి మరియు చక్రపాణి నిర్మించగా ప్రముఖ దర్శకులు కె. వి. రెడ్డి దర్శకత్వం వహించారు. కె.వి. రెడ్డి గారు పింగళి నాగేంద్రరావు మరియు కమలాకర కామేశ్వర రావుతో కలిసి చిత్రానికి కథను కూడా రాశారు. ఇది ఏకకాలంలో తెలుగు మరియు తమిళ భాషలలో చిత్రీకరించబడినది. ఇందులో ఎన్. టి. రామారావు కథానాయకుడు తోటరాముడుగా,  మాలతి రాజకుమారిగా, ఎస్. వి. రంగారావు నేపాళ మాంత్రికునిగా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం మధిర సుబ్బన్న దీక్షితులు రచించిన కాశీ మజిలీ కథల ఆధారంగా, పాక్షికంగా అల్లావుద్దీన్ కథ, బాలనాగమ్మ కథ మొదలైన వాటి ప్రేరణ ద్వారా  రూపొందించబడింది. ఘంటసాల చిత్రానికి సంగీతం అందించగా, మార్కస్ బార్ట్లీ సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. పాతాళ భైరవి తెలుగు వెర్షన్ 1951 మార్చి 15, మరియు తమిళ వెర్షన్ 1951 మే 17 విడుదలయ్యాయి. రెండు వెర్షన్లు వాణిజ్యపరంగా విజయం సాధించాయి, తెలుగు వెర్షన్ 200 రోజులు నేరుగా ప్రదర్శించబడిన మొదటి చిత్రంగా నిలిచింది. చిత్రం 1985లో 'పాతాళ్ భైరవి' పేరుతో హిందీలో కూడా పునర్నిర్మించబడింది.  కలర్ లో తిరిగి చిత్రీకరించిన రెండు పాటలతో కూడిన హిందీ డబ్బింగ్ వెర్షన్ కూడా వాణిజ్యపరంగా విజయం సాధించింది.

పాతాళ భైరవి చిత్రం రామారావు మరియు రంగారావు ఇద్దరికీ వారి నటజీవితంలో ఒక మైలురాయిగా చెప్పవచ్చును. అంతేకాక ఇది మొదటి అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం (IFFI) లో ప్రదర్శించబడిన ఏకైక దక్షిణ భారతీయ చిత్రం కూడా. ఏప్రిల్ 2013 లో భారతీయ సినిమా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా, CNN-IBN 'సార్వకాలిక 100 గొప్ప భారతీయ చిత్రాల' జాబితాలో పాతాళ భైరవిని చేర్చింది. 54 చలనచిత్రోత్సవంలో పునరుద్ధరించబడిన క్లాసిక్స్ విభాగంలో దీనిని పునఃప్రదర్శించారు. ఘంటసాల మాస్టారు బాణీలు కూర్చిన అన్ని పాటలు బహుళ ప్రజాదరణను పొందాయి.

~ చిత్రం వివరాలు ~

చిత్రం#విడుదల నిర్మాణంచిత్రంసంగీతంనిర్మాతలుదర్శకుడు
2424.02.1951విజయాపాతాళ భైరవిఘంటసాలనాగిరెడ్డి-చక్రపాణికె.వి.రెడ్డి

~ పాటల వివరాలు ~

#పాట/పద్యం/శ్లోకంతీరు రచనపాడినవారుఅభినయం
1కలవరమాయే మదిలో(యు)పింగళిఘంటసాల, పి.లీలఎన్.టి.ఆర్., మాలతి
2ఎంత ఘాటు ప్రేమయో(యు)పింగళిఘంటసాల, పి.లీలఎన్.టి.ఆర్., మాలతి
3A  ప్రణయ జీవులకు(సా)పింగళిఘంటసాల, పి.లీలఎన్.టి.ఆర్., మాలతి
3Bహయిగా మనకింక (యు)పింగళిఘంటసాల, పి.లీలఎన్.టి.ఆర్.
4కనుగొనగలనో లేనో(ఏ)పింగళిఘంటసాలఎన్.టి.ఆర్.
5ప్రేమకోసమై వలలో(యు)పింగళి  వి.జె.వర్మ, ఘంటసాలనేపథ్యగానం
6ఇతిహాసం విన్నారా(బృం)  పింగళిటి.జి.కమలాదేవి, బృందంటి.జి.కమలాదేవి, వల్లం సరసింహారావు, బృందం
7తాళలేనే నే తాళలేనే(బృం)పింగళిరేలంగి,బృందంరేలంగి
8తీయని ఊహలు హాయిని(బృం)పింగళివసంత, పి.లీల, బృందంమాలతి, తదితరులు
9రానంటే రానోయి(యు)పింగళిఎ.పి.కోమల, పిఠాపురంపసుమర్తి కృష్ణమూర్తి, సావిత్రి
10వగలోయ్ వగలు(బృం)పింగళిజిక్కి,బృందంలక్ష్మీకాంతం, తదితరులు
11వినవే బాలా నా ప్రేమ(ఏ)పింగళిరేలంగి రేలంగి

ఏ - ఏకగళం; యు - యుగళం; బృం - బృందగీతం; సా - సాకీ.


పాతాళ భైరవి చిత్ర విశేషాలను కిరణ్ ప్రభ రేడియో టాక్ షో లో వినవచ్చు. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి