13, డిసెంబర్ 2025, శనివారం

మల్లీశ్వరి (1951) చిత్రం కోసం ఘంటసాల మాస్తారు పాడిన పాటలు

బి.ఎన్. రెడ్డి గా పిలువబడే బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. ఆయన ప్రఖ్యాత నటగాయకుడు తన వాహినీ స్టూడియోస్ బ్యానర్పై నాగయ్య కథానాయకుడుగా వందేమాతరం (1939) దేవత (1941) వంటి చిత్రాలు నిర్మించారు. అవే కాక స్వర్గసీమ (1945), యోగివేమన (1947), గుణసుందరి కథ (1949) వంటి ప్రతిష్టాత్మక చిత్రాలు నిర్మించారు. తదుపరి 1951లో ఒక చారిత్రక ప్రేమకథా చిత్రం “మల్లీశ్వరి” ని  పి. భానుమతి మరియు ఎన్. టి. రామారావు ఒక జంటగా నిర్మించి, దర్శకత్వం కూడ నిర్వహించారు. ఆయన తన తొలి చిత్రం 'వందేమాతరం' (1939) నిర్మాణ సమయంలో హంపిని సందర్శించినప్పటి నుంచే శ్రీకృష్ణదేవరాయల గురించి ఒక సినిమా తీయాలని కలలు కన్నారు. బుచ్చిబాబు నాటకం 'రాయలవారి కరుణాకృత్యము' మరియు దేవన్ షరార్ రాసిన 'ది ఎంపరర్ అండ్ ది స్లేవ్ గర్ల్' అనే లఘు కథ నుండి ప్రేరణ పొంది, స్క్రిప్ట్ రాయడానికి దేవులపల్లి కృష్ణశాస్త్రిని నియమించుకున్నారు. చిత్రానికి సంగీతాన్ని ఎస్. రాజేశ్వరరావు అందించగా, సినిమాటోగ్రఫీని ఆది ఎం. ఇరానీ మరియు బి. ఎన్. కొండారెడ్డి నిర్వహించారు. ఈ చిత్రంలో ఘంటసాల మాస్టారు భానుమతితో మూడు యుగళగీతాలు పాడారు.


మల్లీశ్వరి తెలుగు సినిమాలో ఒక క్లాసిక్ చిత్రంగా నిలిచింది. దీనిని దర్శకుడిగా బి. ఎన్. రెడ్డి యొక్క ఉత్తమ చిత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అంతేకాక, ఇది విజయచిత్ర పత్రికలో ధారావాహికగా ప్రచురితమైన మొదటి చిత్ర స్క్రిప్ట్‌గా నిలిచింది, మరియు యునైటెడ్ స్టేట్స్‌లోని కొన్ని విశ్వవిద్యాలయాలు ఈ చిత్ర స్క్రిప్ట్‌ను తమ పాఠ్య అధ్యయనాలలో భాగంగా చేర్చుకోవాలని కోరుకున్నాయి. ఏప్రిల్ 2013లో భారతీయ సినిమా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా, CNN-IBN 'సార్వకాలిక 100 గొప్ప భారతీయ చిత్రాలు' అనే తన జాబితాలో మల్లీశ్వరి చిత్రాన్ని చేర్చింది.

~ చిత్రం వివరాలు ~

చిత్రం#విడుదల నిర్మాణంచిత్రంసంగీతంనిర్మాత & దర్శకుడు
2520.12.1951వాహినీమల్లీశ్వరిఎస్.రాజేశ్వరరావుబి.ఎన్.రెడ్డి

~ పాటల వివరాలు ~

#పాట/పద్యం/శ్లోకంతీరు రచనపాడినవారుఅభినయం
1పరుగులుతీయాలి ఒ గిత్తలు(యు)దేవులపల్లిఘంటసాల, పి.భానుమతిఎన్.టి.ఆర్., భానుమతి
2ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు(యు)దేవులపల్లిఘంటసాల, పి.భానుమతిఎన్.టి.ఆర్., భానుమతి
3ఔనా ! నిజమేనా ఔనా !(యు)దేవులపల్లిఘంటసాల, పి.భానుమతిఎన్.టి.ఆర్., భానుమతి

ప్రఖ్యాత టాక్ షో హోస్ట్ శ్రీ కిరణ్ ప్రభ గారు మల్లీశ్వరి చిత్రం పై చేసిన విశ్లేషణ వివరాలను ఈ క్రింది వీడియోలలో చూడవచ్చును.  కిరణ్ ప్రభ గారికి ధన్యవాదములు.

కిరణ్ ప్రభ - మల్లీశ్వరి మొదటి భాగం


కిరణ్ ప్రభ - మల్లీశ్వరి రెండవ బాగం

కిరణ్ ప్రభ - మల్లీశ్వరి  మూడవ భాగం



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి