యువ పిక్చర్స్ పతాకంపై పి ఎస్. శేషాచలం 1952 లో నిర్మించిన చిత్రం “టింగ్ రంగా”. ఈ చిత్రానికి దర్శకత్వం వహించినది బి. ఏ.సుబ్బారావు. ఈ చిత్రంలో ఎస్. వరలక్ష్మి, మంత్రవాది శ్రీరామమూర్తి, నల్ల రామమూర్తి, కనకం ప్రథాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం టి వి. రాజు మరియు ఎస్. బి. దినకరరావు సమకూర్చారు. ఈ చిత్రంలో పాటలున్నాయి. అందులో ఘంటసాల మాస్టారు మూడు ఏకగళగీతాలను, ఒక యుగళ గీతం ఎస్.వరలక్ష్మి తో పాడారు.
~ చిత్రం వివరాలు ~
| చిత్రం# | విడుదల | నిర్మాణం | చిత్రం | సంగీతం | నిర్మాత | దర్శకుడు |
|---|---|---|---|---|---|---|
| 29 | 06.06.1952 | యువా | టింగ్ రంగా | టి.వి.రాజు,ఎస్.బి.దినకరరావు | పి.ఎస్.శేషాచలం | బి.ఏ.సుబ్బారావు |
~ పాటల వివరాలు ~
| # | పాట/పద్యం/శ్లోకం | తీరు | రచన | పాడినవారు | అభినయం |
|---|---|---|---|---|---|
| 1 | కవి కలముకు శిల్పి ఉలికి | (ఏ) | తాపీ ధర్మారావు | ఘంటసాల | శ్రీరామమూర్తి |
| 2 | రాజా మహరాజా | (ఏ) | తాపీ ధర్మారావు | ఘంటసాల | శ్రీరామమూర్తి |
| 3 | బేలవుగా కనజాలవుగా | (ఏ) | తాపీ ధర్మారావు | ఘంటసాల | శ్రీరామమూర్తి |
| 4 | లోకప్రియా హే శ్యామలా\ | (ఏ) | తాపీ ధర్మారావు | ఘంటసాల | శ్రీరామమూర్తి |
| 5 | లేదా మునుపిది కనుగొన | (యు) | తాపీ ధర్మారావు | ఘంటసాల, ఎస్.వరలక్ష్మి | శ్రీరామమూర్తి, ఎస్.వరలక్ష్మి |
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి