1, జనవరి 2026, గురువారం

పెళ్ళిచేసి చూడు (1952) చిత్రం కోసం ఘంటసాల మాస్టారు సంగీతం కూర్చిన పాటలు

నాగిరెడ్డి మరియు చక్రపాన్ణి వారి ప్రతిష్ఠాత్మకమైన విజయా ప్రొడక్షన్సు బ్యానర్ క్రింద L. V. ప్రసాద్ దర్శకత్వంలో 1952 లో నిర్మించబడిన వ్యంగ్య హాస్య చిత్రం “పెళ్ళిచేసిచూడు”. దీనిని ఏకకాలంలో తెలుగు మరియు తమిళ (కళ్యాణం పన్ని పర్) భాషలలో నిర్మించారు. ఇందులో ఎన్.టి.రామారావు, జి.వరలక్ష్మి, యండమూరి జోగారావు, సావిత్రి నటించారు. S. V. రంగారావు, శివరామ కృష్ణయ్య, దొరస్వామి మరియు సూర్యకాంతం తెలుగు వెర్షన్‌లో సహాయక పాత్రలు పోషిస్తుండగా, తమిళంలో కృష్ణయ్య స్థానంలో C. V. V. పంతులు నటించారు.

ఈ చిత్రం కట్న వ్యవస్థ వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను నాయికా నాయకులైన అమ్మడు (జి. వరలక్ష్మి) మరియు వెంకట రమణ (రామారావు) పాత్రల  వైవాహిక జీవితం ద్వారా తెలియజేస్తుంది. విజయా వారి 'పాతాళ భైరవి' (1951) విడుదలైన తర్వాత ఈ సినిమా నిర్మాణం ప్రారంభమైంది. మార్కస్ బార్ట్‌లీని సినిమాటోగ్రాఫర్‌గా నియమించారు. ఘంటసాల మాస్టారు ఈ చిత్రానికి రసవత్తరమైన సంగీతం సమకూర్చారు. ఈ చిత్రానికి నేపథ్య గానం ఘంటసాల, పి.లీల, ఎ.పి.కోమల, కె. రాణి, యు. సరోజిని, జి.భారతి, పిఠాపురం నాగేశ్వరరావు, రామకృష్ణ, శకుంతల, మరియు జి.వరలక్ష్మి.


ఈ చిత్రం 1952 ఫిబ్రవరి 29న విడుదల కాగా, దీని తమిళ వెర్షన్ ఆగస్టు 15న విడుదలైంది. ఈ రెండు వెర్షన్లూ వాణిజ్యపరంగా విజయం సాధించి, కల్ట్ క్లాసిక్‌లుగా నిలిచాయి. అంతేకాకుండా, గేవా కలర్‌లో సన్నివేశాలు ఉన్న మొదటి దక్షిణ భారత చిత్రంగా 'కళ్యాణం పణ్ణి పార్' గుర్తింపు పొందింది. అయితే, తెలుగు వెర్షన్‌లో రంగుల సన్నివేశాలు లేవు. ఆ తర్వాత 'పెళ్లి చేసి చూడు' చిత్రాన్ని విజయ ప్రొడక్షన్స్ వారు కన్నడంలో 'మదువే మాడి నోడు' (1965)గా, హిందీలో 'షాదీ కే బాద్' (1972) గా రీమేక్ చేశారు. కన్నడ వెర్షన్ వాణిజ్యపరంగా విజయం సాధించగా, హిందీ వెర్షన్ విజయం సాధించలేదు.

~ చిత్రం వివరాలు ~

చిత్రం#విడుదల నిర్మాణంచిత్రంసంగీతంనిర్మాతదర్శకుడు
2729.02.1952విజయాపెళ్ళి చేసి చూడుఘంటసాలనాగిరెడ్డి-చక్రపాణిఎల్.వి.ప్రసాద్

~ పాటల వివరాలు ~

#పాట/పద్యం/శ్లోకంతీరు రచనపాడినవారుఅభినయం
1ఎవడొస్తాడో చూస్తాగా(యు)   పింగళిగిడుగు భారతి తోమహంకాళి వెంకయ్య, పుష్పలత
2ఓ భావిభారత భాగ్యవిధాత(సా)పింగళిఘంటసాలఎన్.టి.ఆర్.
2పెళ్ళిచేసుకొని ఇల్లు(ఏ)పింగళిఘంటసాలఎన్.టి.ఆర్.
3ఎవరో ఎవరో ఈ నవనాటక(యు)పింగళిపి.లీల తోఎన్.టి.ఆర్., జి.వరలక్ష్మి
4రాధనురా నీ రాధనురా(ఏ)పింగళిఘంటసాలఎన్.టి.ఆర్.
4ఓ మనసులోని మనసా(సా)పింగళిఘంటసాలఎన్.టి.ఆర్.
5ఏమిటే నీ రభస(ఏ)పింగళిఘంటసాలఎన్.టి.ఆర్.
6బయమెందుకే సిట్టి(ఏ)పింగళిఘంటసాలమహంకాళి వెంకయ్య (పుష్పలత తో)
7ఈ జగమంతా (ఏ)పింగళిఘంటసాలఎన్.టి.ఆర్.
8అమ్మా నొప్పులే(బ)పింగళికె.రాణి,యు.సరోజిని, ఎ.పి.కోమలకందా మోహన్, బేనీ ఉష, బేబీ గిరిజ
9ఎచ్చట నుండొచ్చినారూ    (యు)పింగళిరామకృష్ణ,శకుంతలమాస్టర్ కుందు, బేబీ గిరిజ
10  ఏ వూరు దానివే(యు)పింగళిరామకృష్ణ,శకుంతలమాస్టర్ కుందు, బేబీ గిరిజ
11ఏడుకొండలవాడా! (ఏ)పింగళిపి.లీలజి.వరలక్ష్మి
12ఏడుకొండలవాడా! (ఏ)పింగళిజిక్కీసినిమాలో లేదు
13ఏడవకు ఏడవకు యెర్రి(బ)పింగళిపామర్తి,జిక్కీ,జి.వరలక్ష్మిబాలకృష్ణ, జి.వరలక్ష్మి, సావిత్రి
14ప్రియా ! ప్రియా! హా ప్రియా!(బ)పింగళిపి.లీల,పిఠాపురం,రామకృష్ణసావిత్రి, జోగారావు, మాస్టర్ కుందు
15పెళ్ళిచేసి చూపిస్తాం(యు)పింగళిపిఠాపురం,రామకృష్ణజోగారావు, మాస్టర్ కుందు
16పోవమ్మా బలికావమ్మా(ఏ)పింగళివి.జె.వర్మనేపథ్యగానం
17బ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యా(బ)ఊటుకూరి  కె.రాణి,యు.సరోజిని, ఎ.పి.కోమలమాస్టర్ కుందు, బేబీ రాజకుమారి, మాస్టర్ కోటిలింగం
18మనసా నేనెవరో నీకు(ఏ)పింగళిపి.లీలజి.వరలక్ష్మి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి