1952 లో పి. భానుమతి మరియు ఎ.నాగేశ్వరరావు నాయికా నాయకులు గా నటించిన భరణీ సంస్థ నిర్మించిన చిత్రం "ప్రేమ". ఈ చిత్రానికి తన తొలి ప్రయత్నంగా కథ సమకూర్చినది భానుమతీ రామకృష్ణ. అయితే ఇదివరలో వారు తీసిన లైలా మజ్ను చిత్రపు కథనే రొమాంటిక్ ట్రాజెడీగా అదే ప్రధాన నటులతో "ప్రేమ" చిత్రంగా నిర్మించినా అది విజయవంతం కాలేదు. అయితే సంగీత దర్శకులు సి. ఆర్. సుబ్బురామన్ బాణీలు బాగా పాపులర్ అయ్యాయి. చిత్రమేమిటంటే సుబ్బురామన్ మాస్టారితో 'స్వప్నసుందరి' లో పాడించిన తరువాత 'ప్రేమ' చిత్రానికి స్వరసారధ్యం వహించేలోగా అర డజను చిత్రాలు చేసినా ఎందుకో ఘంటసాలతో పాడించలేదు. 'ప్రేమ' చిత్రానికి మాస్టారు మూడు పాటలు పాడారు. అవి దివ్య ప్రేమకు సాటియౌనే, రోజుకు రోజు మరింత మోజు, నా ప్రేమ నావ. పాటలు వ్రాసినది కొండముది గోపాలరాయ శర్మ. ముక్కామల, సి. యస్. ఆర్. ఆంజనేయులు, రేలంగి, శ్రీరంజని తదితర నటీనటులు.
~చిత్రం వివరాలు~
| చిత్రం# | విడుదల | నిర్మాణం | చిత్రం | సంగీతం | నిర్మాత | దర్శకుడు |
|---|---|---|---|---|---|---|
| 28 | 21.03.1952 | భరణి | ప్రేమ | సి.ఆర్.సుబ్బురామన్ | పి.రామకృష్ణ | పి.రామకృష్ణ |
~పాటల వివరాలు~
(పోస్ట్ చేసిన పాటల/పద్యాల వివరాలను ఎరుపు రంగులోని ఆయా లింకులపై క్లిక్ చేసి చూడవచ్చు)
| # | పాట/పద్యం/శ్లోకం | తీరు | రచన | పాడినవారు | అభినయం |
|---|---|---|---|---|---|
| 1 | రోజుకు రోజు మరింత మోజు | (యు) | గోపాలరాయశర్మ | పి.భానుమతి తో | అక్కినేని, భానుమతి |
| 2 | దివ్య ప్రేమకు సాటి ఔనే | (యు) | గోపాలరాయశర్మ | పి.భానుమతి తో | అక్కినేని, భానుమతి |
| 3 | నా ప్రేమ నావ ఈరీతిగా | (ఏ) | గోపాలరాయశర్మ | ఘంటసాల | అక్కినేని |
యు-యుగళగీతం, ఏ-ఏకగళగీతం.
కృతజ్ఞతలుః ఈ చిత్రపు వివరాలను పొందుపరచిన "ఘంటసాల గళామృతము పాటల పాలవెల్లి" వ్యవస్థాపకులు శ్రీ కొల్లూరి భాస్కర రావు గారికి, వికిపీడియా (Wikipedia) వారికి హృదయపూర్వక ధన్యవాదములు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి