7, జనవరి 2026, బుధవారం

ప్రియురాలు చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పాడిన పాటలు


1952 లో విడుదలైన "ప్రియురాలు" చిత్రం విశేషం ఏమిటంటే, అంతవరకూ తెలుగు శ్రోతలకు తన కంచు కంఠంతో రేడియోలో వార్తలు వినిపించి, "కళా వాచస్పతి" యని వాసికెక్కిన శ్రీ కొంగర జగ్గయ్య గారి తొలి చిత్రం యిది. ఆర్ధికంగా ఈ చిత్రం అంత విజయం సాధించలేదనుకోండి. ఈ చిత్రానికి నిర్మాత శ్రీ దోనేపూడి కృష్ణమూర్తి గారు. ఆయన ఒకప్పుడు "సంసారం" చిత్రానికి సావిత్రి గారిని సూచించారట.  కాని అందులో మరీ చిన్నవేషం అవడం వలన సావిత్రి గారు నటించలేదు. అయితే తన స్వతంత చిత్రంలో ఆమెకు ప్రధాన పాత్ర ఇస్తానని వాగ్దానం చేసి, తరువాత తన తొలి  చిత్రమైన "ప్రియురాలు" లో సావిత్రికి ముఖ్యమైన భూమికను ఇచ్చారట.  ఈ చిత్రానికి కథ, మాటలు, దర్సకత్వం వహించినది ప్రముఖ హేతువాది, జర్నలిస్టు శ్రీ త్రిపురనేని గోపీచంద్ గారు. శ్రీ గోపీచంద్ గారు కథా, నవలా రచయితా, సాహితీవేత్త, స్క్రీన్ ప్లే రచయిత. వీరి రచన "పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా" కు జాతీయ సాహిత్య అవార్డు లభించినది. అంతే కాక వీరి శతజయంతి సందర్భంగా ఆయన చేసిన గణనీయమైన సాహిత్యసేవకు గుర్తుగా వారి పేరు మీద భారత తంతి తపాలా శాఖ వారు  తపాలాముద్ర (postage stamp) ను విడుదల చేసారు.  హీరోయిన్ గా సావిత్రి, సహాయ పాత్రలో కృష్ణకుమారి నటించిన ఈ చిత్రంలో ఘంటసాల మాస్టారు ఐదు పాటలు పాడారు. కాని అందులో రెండే లభ్యమవుతున్నాయి. ప్రధానంగా సంగీత దర్శకులు సాలూరు వారైనప్పటికీ ఆరోజులలో సహాయ దర్శకులకు కూడా సమాన హోదా కలిగించే ఉదారత మనకు కనిపిస్తుంది. త్రిపురనేని గోపీచంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2వ తేదీన విడుదలైంది. ఈ చిత్రం కోసం ఘంటసాల మాస్టారు ఆర్.బాలసరస్వతీదేవి తో రెండు యుగళ గీతాలు, ఆర్.బాలసరస్వతి మరియు జిక్కీతో ఒక బహుగళ గీతం, జిక్కి, బృందంతో ఒక గీతం, ఒక ఏకగళ గీతం పాడారు. అందులో రెండు గీతాలు అలభ్యం.

~ చిత్రం వివరాలు ~


చిత్రం#విడుదల నిర్మాణంచిత్రంసంగీతంనిర్మాతదర్శకుడు
2620.02.1951భారతలక్ష్మీప్రియురాలుసాలూరు, అద్దేపల్లి, బాలాంత్రపుడి.కృష్ణమూర్తిగోపీచంద్

~ పాటల వివరాలు ~

(Posted songs with lyrics/audio or video can be viewed by clicking the song link that is in RED)

#పాట/పద్యం/శ్లోకంతీరు రచనపాడినవారుఅభినయం
1వినరావో ఓ వింతలోకమా (సా)అనిసెట్టిఘంటసాల,ఆర్.బాలసరస్వతిజగ్గయ్య,లక్ష్మీకాంత
1కన్నీరేనా కన్నీరేనా(యు)అనిసెట్టిఘంటసాల,ఆర్.బాలసరస్వతిజగ్గయ్య,లక్ష్మీకాంత
2హాపీ హాపీ డే హోపంతా (అ)(బృం)  అనిసెట్టిఘంటసాల,జిక్కీ,బృందంజగ్గయ్య(కృష్ణకుమారి తో)
3అవనీ నీపతి వెడలి(ఏ)అనిసెట్టి  ఘంటసాలజగ్గయ్య
4ఆనందం మనజీవనరాగం(బ)అనిసెట్టిఘంటసాల,ఆర్.బాలసరస్వతి,జిక్కీ జగ్గయ్య,లక్ష్మీకాంత,కృష్ణకుమారి 
5ఒకసారైనా నీ మధురాలాపన (అ)  (యు)అనిసెట్టిఘంటసాల,ఆర్.బాలసరస్వతిజగ్గయ్య,లక్ష్మీకాంత

అ - అలభ్యం, ఏ - ఏకగళ గీతం, యు - యుగళ గీతం, బ - బహుగళ గీతం, బృం - బృంద గీతం

కృతజ్ఞతలుః ఈ సినిమా పాటలను పొందుపరచిన "ఘంటసాల గళామృతము - పాటల పాలవెల్లి వ్యవస్థాపకులు శ్రీ కొల్లూరి భాస్కర రావు గారికి ధన్యవాదాలు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి