27, డిసెంబర్ 2024, శుక్రవారం

కీలుగుఱ్ఱం (1949) - చిత్రానికి ఘంటసాల మాస్టారు స్వరపరచిన గీతాలు




1949 సంవత్సరంలో విడుదలైన శోభనాచల సంస్థ నిర్మించిన చిత్రం జానపద చిత్రం కీలుగుఱ్ఱం. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, .వి.సుబ్బారావు, రేలంగి, మహంకాళి వెంకయ్య, కంచి నరసింహారావు, టి.కనకం, బాలామణి, సూర్యశ్రీ, జూనియర్లక్ష్మిరాజ్యం, సురభి కమలాబాయి, గంగారత్నం మొదలగువారు. చిత్రానికి నిర్మాత మరియు దర్శకుడు మీర్జాపురం రాజా. ఈ చిత్రంలో పాటలన్నీ తాపీ ధర్మారావు నాయుడు వ్రాసారు. ఒక్క పాట తప్ప, అన్ని పాటలకు సంగీతదర్శకత్వం ఘంటసాల మాస్టారు. మాస్టారు సంపూర్ణంగా సంగీత దర్శకత్వం వహించిన తొలి తెలుగు చిత్రమిది. తొలినాటి నాటకాలలో వినిపించే పద్యాల ఆలాపనకు భిన్నంగా ఘంటసాల మాస్టారు పద్యగాయనానికి తనదంటూ ఒక ప్రత్యేయ ఒరవడిని తెలుగు చిత్రాలలో ప్రయోగించారు. ఈ చిత్రంలో మాస్టారు ఆలపించిన “పూనిక రాజవంశమున పుట్టిన కన్య” అనే పద్యం తెలుగు చలనచిత్ర సీమలో మాస్టారి మొదటి పద్యం.  శోభనాచల స్టూడియో బేనర్ పాటకు టి.ఎ. మోతీ సంగీతం సమకూర్చారు, సి.కృష్ణవేణి పాడారు. మీర్జాపురం రాజుగారి సతీమణి మరియు నటి, గాయకురాలైన సి.కృష్ణవేణి కొన్ని ఏకగళ గీతాలు, ఘంటసాల మాస్టారితో ఒక యుగళగీతం ‘తెలియవశమా పలుకగలమా’ పాడారు. ఈ చిత్రంలో మాస్టారు వక్కలంక సరళతో పాడిన ‘కాదు సుమా కల కాదుసుమా’ బహుళ ప్రాచుర్యం పొందింది. మరొక గాయని శ్రీదేవితో ఘంటసాల మాస్టారు ‘ఎంత కృపామతివే భవానీ’ అనే యుగళగీతం పాడారు.



విషయమువివరము
నిర్మాణ సంస్థ(లు):శోభనాచల
చిత్రం (సంవత్సరం):కీలుగుఱ్ఱం (1949)
సంగీతం:ఘంటసాల
నిర్మాత(లు):మీర్జాపురం రాజా
దర్శకత్వం:మీర్జాపురం రాజా

కీలుగుఱ్ఱం (1949) చిత్రం పాటల వివరాలు

#పాట/పద్యం పేరుతీరురచనపాడినవారు
1అమ్మ కావుమమ్మా మమ్ము(ఏ)తాపీ ధర్మారావు నాయుడుపి.లీల
2ఆహా ఓహో ఎంతానందంబాయె(ఏ)తాపీ ధర్మారావు నాయుడువి.సరళ
3ఎంత కృపామతివే భవాని(యు) తాపీ ధర్మారావు నాయుడుఘంటసాల, శ్రీదేవి
4ఎవరు చేసిన ఖర్మ వారనుభవింపక(ఏ)తాపీ ధర్మారావు నాయుడుఘంటసాల
5కాదుసుమా కలకాదుసుమా(యు)తాపీ ధర్మారావు నాయుడుఘంటసాల, వి.సరళ
6గాలికన్నా కోలకన్నా(ఏ)తాపీ ధర్మారావు నాయుడుఘంటసాల
7చూచి తీరవలదా(ఏ)తాపీ ధర్మారావు నాయుడుసి.కృష్ణవేణీ
8చెంపవేసి నాకింపు చేసితివి(యు)తాపీ ధర్మారావు నాయుడురేలంగి, టి.కనకం
9తెలియవశమా పలుకగలమా(యు) తాపీ ధర్మారావు నాయుడుఘంటసాల, సి.కృష్ణవేణి
10దిక్కు తెలియదేమి సేతు(ఏ)తాపీ ధర్మారావు నాయుడుపి.లీల
11నిదురబో నాయన్న(ఏ)తాపీ ధర్మారావు నాయుడుపి.లీల
12పూనిక రాజ వంశమున(ప)తాపీ ధర్మారావు నాయుడుఘంటసాల
13భాగ్యము నాదేనోయీ(ఏ)తాపీ ధర్మారావు నాయుడుసి.కృష్ణవేణి
14మన కాళి శక్తికి మన (బృం)తాపీ ధర్మారావు నాయుడుఘంటసాల, బృందం
15మము బ్రోవవే నూతా(ఏ)తాపీ ధర్మారావు నాయుడుపి.లీల
16మోహనమహా హా (ఏ)తాపీ ధర్మారావు నాయుడుసి.కృష్ణవేణి
17శోభనగిరి నిలయా దయామయ*(ఏ)తాపీ ధర్మారావు నాయుడుసి.కృష్ణవేణి
*ఈ పాట శోభనాచల స్టూడియో బేనర్ పాట. దీనికి టి.ఎ. మోతీబాబు సంగీతం సమకూర్చారు.

పొందుపరచిన లింకులపై క్లిక్ చేసి పాట/పద్యం/శ్లోకం యొక్క ఆడియో/వీడియోలను సాహిత్యాన్ని న "ఘంటసాల" బ్లాగ్ లో చూడగలరు.

(ఏ): ఏకగళం, (యు): యుగళం, (బ): బహుగళం, (బృం): బృందగీతం, (ప): పద్యం, (సం.ప.): సంవాద పద్యాలు, (దం): దండకం, (శ్లో): శ్లోకం, (బు): బుర్రకథ, (హ): హరికథ, (నా): నాటకము; (స్తు): స్తుతి; (స్తో): స్తోత్రం, (అ): అలభ్యం; (తె): తెలియదు, సు: సుప్రభాతం, సాం.శ్లో: సాంప్రదాయ శ్లోకం, 

DISCLAIMER: ఈ చలనచిత్ర వివరాలను నా "ఘంటసాల గానపద సూచిక" ప్రారంభ పుటలో పేర్కొన్న వివిధ వనరుల నుండి సేకరించడమైనది. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది పూర్తిగా దోషరహితము కాదని మనవి. ఏవైనా సూచనలు, సవరణలు వుంటే దయచేసి కామెంట్లలో తెలుపగలరు. లేదా నా email - suryvulimiri@gmail కు పంపగలరు. This information is provided for entertainment and educational purpose only and no commercial purpose is being intended.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి