విడుదల 07-04-1950 |
వాహినీ సంస్థలో
భాగస్వామిగా వున్న బి. నాగిరెడ్డి తన మిత్రుడు చక్రపాణితో కలసి “విజయా” సంస్థను నెలకొల్పి
1950 సంవత్సరంలో
ఎల్. వి. ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించి,
విడుదల చేసిన తొలి చిత్రం
“షావుకారు”. ప్రతినాయకుని లక్షణాలు
కలిగిన షావుకారు చెంగయ్యగా నటించిన గోవిందరాజుల సుబ్బారావు చిత్ర కథానాయకుడు. ఈ చిత్రంలో
పాటలన్నీ సముద్రాల రాఘవాచార్యులు
(సీనియర్) గారు వ్రాసారు. ఈ చిత్రంలో
తారాగణం ఎన్.టి.రామారావు,జానకి, ఎస్.వి. రంగారావు,
రేలంగి,మోపర్రు దాసు,పద్మనాభం, గోవిందరాజుల
సుబ్బారావు,వంగర, కనకం,వల్లభజోస్యుల శివరాం,
పి.శాంతకుమారి. 1949 లో ఎన్.టి.ఆర్. తెలుగు చలనచిత్ర రంగ ప్రవేశం చేసారు. 1950 లో ఎన్.టి. ఆర్. మరియు ఏ.ఎన్.ఆర్. నటించిన 'పల్లెటూరి పిల్ల' షూటింగు షావుకారు చిత్రం కన్నా ముందు జరిగింది. కాని మొదట విడుదలైన చిత్రం షావుకారు. అందువలన సోలో కథానాయకునిగా ఎన్.టి.ఆర్. కు షావుకారు తొలి చిత్రం. ఈ చిత్రంలో కథానాయికగా పరిచయమయిన శంకరమంచి జానకి తదుపరి 'షావుకారు జానకి' గా మనందరికి సుపరిచితం. సముద్రాల సీ. రచనలకు చక్కగా స్వరపరచారు ఘంటసాల
మాస్టారు. చిత్రం శిబిచక్రవర్తి
కథ ఆధారంగా హరికథతో ప్రారంభమవుతుంది. తెలుగు చలనచిత్రాలలో ఇది తొలి హరికథగా చెప్పవచ్చు.
దీనిని మాస్టారు ఆలపించగా, వచనాన్ని మోపర్రుదాసు చెప్పారు. షావుకారు చిత్రంలో 16 పాటలున్నాయి.
అందులో మాధవపెద్ది పాడిన ‘తెలుసుకోరా జీవా’ అనే పాట అలభ్యం. కొద్దిగా భాగవత పఠనం ఎం.ఎస్.
రామారావు చేశారు. ఈ చిత్రంలో ఘంటసాల మాస్టారు, మాధవపెద్ది, పిఠాపురం, ఎం.ఎస్. రామారావు,
ఆర్.బాలసరస్వతి, జిక్కీ, శాంతకుమారి, టి.కనకం గాయనీ గాయకులు.
విషయము | వివరము |
---|---|
నిర్మాణ సంస్థ(లు): | విజయా |
చిత్రం (సంవత్సరం): | షావుకారు (1950) |
సంగీతం: | ఘంటసాల |
నిర్మాత(లు): | నాగిరెడ్డి-చక్రపాణి |
దర్శకత్వం: | ఎల్.వి.ప్రసాద్ |
# | పాట/పద్యం పేరు | రచన | పాడినవారు |
---|---|---|---|
1 | ఇంతేనన్నా నిజమింతేనన్నా (ఏ) | సముద్రాల సీ. | మాధవపెద్ది |
2 | ఏమనెనే చిన్నారి ఏమనెనే (ఏ) | సముద్రాల సీ. | ఘంటసాల |
3 | ఏలా వగతువురా జీవా (ఏ) | సముద్రాల సీ. | మాధవపెద్ది |
4 | కలవాని సుతుల మనుచును (ప) | సముద్రాల సీ. | ఎం.ఎస్.రామారావు |
5 | తెలుపవేలనే చిలుకా (ఏ) | సముద్రాల సీ. | ఆర్.బాలసరస్వతి |
6 | తెలుసుకోరా వెర్రిజీవా (అ) (ఏ) | సముద్రాల సీ. | మాధవపెద్ది |
7 | దీపావళీ దీపావళీ (బృం) | సముద్రాల సీ. | ఘంటసాల, ఆర్.బాలసరస్వతి, శాంతకుమారి, బృందం |
8 | పలుకరాదటే చిలుకా 1 (ఏ) | సముద్రాల సీ. | ఘంటసాల |
9 | పలుకరాదటే చిలుకా 2 (యు) | సముద్రాల సీ. | ఘంటసాల, ఆర్.బాలసరస్వతి |
10 | బలే దొరలకు దొరకని సొగసు (ఏ) | సముద్రాల సీ. | టి.కనకం |
11 | మనసా...పెడదారి పడకే (ఏ) | సముద్రాల సీ. | మాధవపెద్ది |
12 | మారిపోవురా కాలము (ఏ) | సముద్రాల సీ. | మాధవపెద్ది |
13 | విరహవ్యధ మరచుకథ (యు) | సముద్రాల సీ. | పిఠాపురం, జిక్కీ |
14 | శ్రీలు చెలంగే భారతభూమిని (హ) | సముద్రాల సీ. | ఘంటసాల, మోపర్రుదాసు (వచనం) |
15 | సంపన్నుం డొరుగానలేడు (ప) | ఆంధ్రమహాభాగవతం | ఎం.ఎస్.రామారావు |
16 | సరసులకిది సమయమేరా (యు) | సముద్రాల సీ. | పిఠాపురం, జిక్కీ |
|
(ఏ): ఏకగళం, (యు): యుగళం, (బ): బహుగళం, (బృం): బృందగీతం, (ప): పద్యం, (సం.ప.): సంవాద పద్యాలు, (దం): దండకం, (శ్లో): శ్లోకం, (బు): బుర్రకథ, (హ): హరికథ, (నా): నాటకము; (స్తు): స్తుతి; (స్తో): స్తోత్రం, (అ): అలభ్యం; (తె): తెలియదు, సు: సుప్రభాతం, సాం.శ్లో: సాంప్రదాయ శ్లోకం.
ఘంటసాల గానపదసూచిక (HOME)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి