24, జులై 2026, శుక్రవారం

ఘంటసాల మాస్టారి స్వంత చిత్రం పరోపకారం (1953) కోసం మాస్టారు స్వరపరచిన, పాడిన పాటలు

 

ఘంటసాల మాస్టారు నిర్మించిన తొలిచిత్రం పరోపకారం. ఈ చిత్రం ఘోర పరాజయం చవిచూసింది. అప్పుడు ఈ చిత్రం గురించి పరులకు ఉపకారం చేయటం కోసమే పరోపకారం తీసాను అని ఘంటసాల అనేవారట.  శోభ ఫిలింస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి కమల్ ఘోష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ముక్కామల, సావిత్రి, జి.వరలక్ష్మి, సి.ఎస్. ఆర్. గా పిలవబడే చిలకలపూడి సీతారామాంజనేయులు మొదలగు వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల మాస్టారు సమకూర్చారు.  ఈ చిత్రంలో మాస్టారు పాడిన “హృదయమా సాగిపొమ్మా” అనే పాట ప్రఖ్యాతి గాంచినది.




ఈ చిత్రం గుఱించి ప్రముఖ చలనచిత్ర వ్యాఖ్యాత శ్రీ కిరణ్ ప్రభ గారి స్పందనను పై వీడియోలో వినవచ్చు. ఈ అమూల్యమైన సమాచారాన్ని సేకరించి పొందుపరచిన వారికి హృదయపూర్వక ధన్యవాదములు.

~ చిత్రం వివరాలు ~

చిత్రం#విడుదల నిర్మాణంచిత్రంసంగీతంనిర్మాతదర్శకుడు
3618.06.1953శోభాపరోపకారంఘంటసాలబి.చలపతిరావుకమల్ ఘోష్

~ పాటల వివరాలు ~

#పాట/పద్యం పేరుతీరు రచనపాడినవారు Actor
1హృదయమా సాగిపొమ్మా(ఏ)ఆరుద్రఘంటసాలబి.గోపాలం
2A  ఆ..ఆ. మరపురాని పాటలోని(సా)  ఆరుద్రఘంటసాలముక్కామల
2Bవలపుల కధ ఇది(ఏ)ఆరుద్రఘంటసాలముక్కామల
3జోడెడ్ల నడమ జోరైన రగడ(ఏ)ఆరుద్రఘంటసాలఆర్.నాగేశ్వరరావు
4తీయని ఈ కాపురమే(ఏ)ఆరుద్రఘంటసాలముక్కామల
5నరజన్మ అత్యున్నతమురా (అ)(ఏ)ఆరుద్రమాధవపెద్దితెలియదు
6కనులు కాయలు కాచినా (అ)(ఏ)ఆరుద్రపి.లీలసావిత్రి
7కలిగినదేదో తెలియని కోరిక (అ)(ఏ)ఆరుద్రపి.లీలసావిత్రి
8దయగల దైవము నీవే (అ)(ఏ)ఆరుద్రపి.లీలజి.వరలక్ష్మి
9 నిరుపేదల లోకము ఇంతేనోయి (అ)(ఏ)ఆరుద్రఎ.పి.కోమలతెలియదు
10 సబ్బు చేయవలెరా నరుడా (అ)(ఏ)ఆరుద్రపిఠాపురంరేలంగి
11హృదయము వూగిసలాడి (అ)(బ)ఆరుద్రఘంటసాల, ఎ.ఎం.రాజా, పి.లీల, ఎ.పి.కోమలసావిత్రి, రామశర్మ, తదితరులు
12అష్టాదశ పురాణాని (అ)(శ్లో)సంస్కృత వాఙ్మయ చరిత్రఘంటసాలపతాకగీతం

(పోస్ట్ చేసిన పాటల/పద్యాల వివరాలను ఎరుపు రంగులోని ఆయా లింకులపై క్లిక్ చేసి చూడవచ్చు) 

యు-యుగళగీతం, ఏ-ఏకగళగీతం, బృం -బృందగీతం, బ -బహుగళగీతం, బు-బుఱ్ఱకథ, హ -హరికథ, శ్లో - శ్లోకం, సా-సాకీ, నా-నాటిక/నాటకం, స్తో-స్తోత్రం, -అలభ్యం.


కృతజ్ఞతలు - ఈ చిత్రంలోని పాటల వివరాలను తమ "ఘంటసాల గళామృతము పాటల పాలవెల్లి" లో పొందుపరచిన శ్రీ కొల్లూరి భాస్కరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

ఘంటసాల గానపదసూచిక (HOME)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి