శ్రీ సముద్రాల రాఘవాచార్యులు (సముద్రాల సీనియర్) గారి తనయుడు శ్రీ సముద్రాల రామానుజాచార్యులు
(సముద్రాల జూనియర్) గారి జీవితం మలుపు తిప్పిన సంవత్సరం 1953
. ఎందుకంటె, ఈ సంవత్సరంలో
కోవెలమూడి భాస్కరరావు గారు తన భాస్కర్ ప్రొడక్షంస్ పతాకం పై నిర్మిస్తున్న తొలి చిత్రం
“ బ్రతుకు తెరువు”
కోసం సముద్రాల జూనియర్ ను అన్ని పాటలు వ్రాయడానికి ఆహ్వానించారు.
కె. భాస్కరరావు గారు ఆనాటి ప్రముఖ దర్శకులు కె.ఎస్. ప్రకాశరావు గారికి అన్న కొడుకు.
ఈ చిత్రానికి P. S.
రామకృష్ణారావు
దర్శకత్వం వహించారు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు,
సావిత్రి,
ఎస్.వి. రంగారావు,
జూనియర్ శ్రీరంజని, రేలంగి మొదలగువారు నటించారు.
ఈ చిత్ర సంగీత దర్శకులైన శ్రీ సి.ఆర్.
సుబ్బురామన్ గారు చిత్రం నిర్మాణదశలో ఉండగానే మరణించారు. అందువలన ఘంటసాల మాస్టారు సంగీత దర్శకత్వ బాధ్యతలు
స్వీకరించారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆవిధంగా ‘బ్రతుకు తెరువు’ చిత్రం సముద్రాల
జూనియర్ కు బ్రతుకు తెరువు నిచ్చింది.
~ చిత్రం వివరాలు ~
| చిత్రం# | విడుదల | నిర్మాణం | చిత్రం | సంగీతం | నిర్మాత | దర్శకుడు |
| 31 | 06.02.1953 | భాస్కర్ ప్రొడక్షంస్ | బ్రతుకు తెరువు | ఘంటసాల | కె.భాస్కరరావు | పి.రామకృష్ణ |
~ పాటల వివరాలు ~
| పాట# | పాట/పద్యం పేరు | తీరు | రచన | పాడినవారు | అభినయం |
| 1 | అందమే ఆనందం | (ఏ) | సముద్రాల జూ. | ఘంటసాల | అక్కినేని |
| 2 | అందమే ఆనందం | (ఏ) | సముద్రాల జూ. | పి.లీల | సావిత్రి |
| 3 | ఎదో మత్తు మందుజల్లి | (ఏ) | సముద్రాల జూ. | పి.లీల | సావిత్రి |
| 4 | గాలిమేడగ కూలే ఆశా* | (ఏ) | సముద్రాల జూ. | కె.ప్రసాదరావు | అక్కినేని |
| 5 | దారితెన్ను కానగరాని | (ఏ) | సముద్రాల జూ. | జిక్కి | శ్రీరంజని |
| 6 | నందగోపాల ఏలా | (ఏ) | సముద్రాల జూ. | పి.లీల | సావిత్రి |
| 7 | రాడాయే కనరాడాయే | (యు) | సముద్రాల జూ. | పి.లీల,ఎ.పి. కోమల | శ్రీరంజని, సావిత్రి |
| 8 | వచ్చెనమ్మా వచ్చేనే | (యు) | సముద్రాల జూ. | జిక్కి,సరోజిని | శ్రీరంజని, బేబీ దువ్వూరి అన్నపూర్ణ |
| 9 | చెలో చెలో యెంకన్నా (అ) | (ఏ) | సముద్రాల జూ. | రేలంగి | రేలంగి |
అ - అలభ్యం; ఏ - ఏకగళం; యు - యుగళం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి