తెలుగు చలనచిత్ర రంగంలో నటుడిగా మంచి గుర్తింపు పొందిన ఎన్.టి.ఆర్. ఈ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఎన్.టి.ఆర్. తన చుట్టమైన దోనేపూడి కృష్ణమూర్తికి ఆర్థికంగా చేయూతనందించడమే కాకుండా, తనలోని నటుడిని, సినిమా పట్ల ఉన్న ఆసక్తిని సంతృప్తి పరిచే ప్రయోగాలు చేయడానికి రామారావు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే బయటి నిర్మాతల పెట్టుబడి మీద ప్రయోగాలు చేయడం ఇష్టం లేక ఆయన సొంతంగా సినిమాలు తీయడం ప్రారంభించారు. ఆ విధంగా 'పిచ్చి పుల్లయ్య' చిత్ర నిర్మాణంలో ఎన్.టి.ఆర్, దోనేపూడి కృష్ణమూర్తి భాగస్వాములుగా ఉండగా, రామారావు సోదరుడు నందమూరి త్రివిక్రమరావు మేనేజింగ్ పార్టనర్‌గా వ్యవహరించారు. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను రామారావు తన పాత రూమ్‌మేట్ తాతినేని ప్రకాశరావుకు అప్పగించారు. తదుపరి తమ ఎన్.ఏ.టి. బ్యానర్ పై మరెన్నో ప్రతిష్టాత్మకమైన చిత్రాలు నిర్మించారు. ఎన్.టి.ఆర్. కు ఆప్తమిత్రుడు, ఒకప్పటి రూం మేట్ అయిన శ్రీ టి.వి. రాజు గా పిలవబడే తోటకూర వెంకట రాజు గారు ఎన్.ఏ.టి. సంస్థకు ఆస్థాన సంగీత దర్శకునిగా వ్యవహరించారు.
~ చిత్రం వివరాలు ~
| చిత్రం# | విడుదల | నిర్మాణం | చిత్రం | సంగీతం | నిర్మాత | దర్శకుడు |
|---|---|---|---|---|---|---|
| 39 | 17.07.1953 | ఎన్.ఏ. | పిచ్చి పుల్లయ్య | టి.వి.రాజు | ఎన్.త్రివిక్రమరావు | టి.చలపతిరావు |
~ మాస్టారు పాడిన పాటల వివరాలు ~
| # | పాట/పద్యం/శ్లోకం | తీరు | రచన | పాడినవారు | అభినయం |
|---|---|---|---|---|---|
| 1 | ఆలపించనా అనురాగముతో | (ఏ) | అనిసెట్టి | ఘంటసాల | నేపథ్యగానం |
| 2 | ఎల్ల వేళలందు | (యు) | అనిసెట్టి | ఘంటసాల, ఆర్.బాలసరస్వతి | నేపథ్యగానం |
ఘంటసాల గానపదసూచిక (HOME)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి