"కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు చ శకుంతలా, తస్యాంచ చతుర్థోఽఙ్కః తత్ర శ్లోకచతుష్టయమ్" అనే సంస్కృత నానుడికి అర్థం - ‘కావ్యాలలో రమ్యంగా వుండేవి నాటకాలు, నాటకాలలో శాకుంతలం, అందునా నాలుగవ అంకం, అందులో మరీ ప్రముఖంగా నాలుగు శ్లోకాలు”. ఈ నాలుగు శ్లోకాలు కూతురైన శకుంతల అత్తవారింటికి వెళ్ళే సమయంలో సాగనంపుతూ తండ్రియైన కణ్వమహర్షి ఇచ్చే సందేశం. ఈ అతి రమ్యమైన శకుంతల నాటకాన్ని పలుభాషలలో (హిందీ, బంగాలీ, మళయాళం, తమిళం, తెలుగు) చలనచిత్రంగా నిర్మించారు. విశేషంగా 1940 లో ఎల్లిస్ ఆర్. దుంగన్ అనే అమెరికా దేశస్థుడు తమిళంలో నిర్మించిన చిత్రంలో ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు శ్రీమతి ఎం.ఎస్.సుబ్బలక్ష్మి శకుంతల గా నటించారు. తెలుగులో తొలిసారిగా 1932 లో యడవల్లి సత్యనారాయణ, సురభి కమలాబాయి మొదలగువారితో సర్వోత్తమ్ బాదామి దర్శకత్వంలో "శకుంతల" చిత్రం నిర్మింపబడింది. మరల రాజ్యం పిక్చర్స్ పతాకంపై శ్రీధరరావు, లక్ష్మీరాజ్యం దంపతులు, పౌరాణిక బ్రహ్మగా పేరొందిన శ్రీయుతులు కమలాకర కామేశ్వరరావు దర్సకత్వంలో ఎన్.టి.ఆర్. దుష్యంతునిగా, బి.సరోజాదేవి శకుంతలగా నిర్మించారు. ఇతర పాత్రలలో నాగయ్య (కణ్వ మహర్షి), ముక్కామల (విశ్వామిత్రుడు), ఇ.వి.సరోజ (మేనక), శారద (ప్రియంవద) మొదలగువారు నటించారు. ఈ చిత్రానికి ఘంటసాల మాస్టారు సంగీతం సమకూర్చారు. కాళిదాసకృత అభిజ్ఞాన శాకుంతల నాటకాన్ని ఆధారంగా సంభాషణలను, కొన్ని గీతాలను, పద్యాలను సముద్రాల రాఘవాచార్యుల వారు వ్రాసారు. కాళిదాసు విరచిత కొన్ని శ్లోకాలను కూడ చిత్రంలో ఉపయోగించారు. సముద్రాల గారితో దాశరథి, శ్రీశ్రీ, డా.సి. నారాయణ రెడ్డి, ఆరుద్ర, కొసరాజు కొన్ని పాటలు వ్రాసారు.
~చిత్రం వివరాలు~
| చి# | విడుదల | నిర్మాణం | చిత్రం | సంగీతం | నిర్మాత | దర్శకుడు |
|---|---|---|---|---|---|---|
| 364 | 23.03.1966 | రాజ్యం వారి | శకుంతల | ఘంటసాల | శ్రీధరరావు-లక్ష్మీరాజ్యం | కె.కామేశ్వర రావు |
~ పాటల వివరాలు ~
| పా# | పాట/పద్యం/శ్లోకం | తీరు | రచన | గానం | అభినయం |
|---|---|---|---|---|---|
| 1 | అనాఘ్రాతం పుష్పం | (శ్లో) | మహాకవి కాళిదాసు | ఘంటసాల | ఎన్.టి.ఆర్. |
| 2 | అమ్మా శకుంతలా | (ఏ) | శ్రీశ్రీ | పి.లీల | నేపథ్యగానం |
| 3 | అమ్మా శరణమ్మా | (ఏ) | సముద్రాల సీ. | పి.సుశీల | బి.సరోజాదేవి |
| 4 | గురుజముల వినయముతో | (సా) | సముద్రాల సీ. | ఘంటసాల, బృందం | నాగయ్య, తదితరులు |
| 4 | ఆనందమౌనమ్మా అపరంజి బొమ్మ | (యు) | సముద్రాల సీ. | ఘంటసాల, బృందం | నాగయ్య, తదితరులు |
| 5 | కనరా మునిశేఖరా | (ఏ) | సముద్రాల సీ. | పి.సుశీల | ఇ.వి.సరోజ (ముక్కామల తో) |
| 6 | చల్లనివై శ్రమం బుడుప | (ప) | కందుకూరి | ఘంటసాల | ఎన్.టి.ఆర్. |
| 7 | చెలియ! నీ మేను | (ప) | సముద్రాల సీ. | ఘంటసాల | ఎన్.టి.ఆర్. |
| 8 | చెలులారా శకుంతల | (బృం) | సముద్రాల సీ. | పి.లీల, వైదేహి, బృందం | గీతాంజలి, శారద, తదితరులు |
| 9 | తరతమ భేదంబు | (ప) | సముద్రాల సీ. | ఘంటసాల | ఎన్.టి.ఆర్. |
| 10 | నమ్మి నీ మాట తన | (ప) | సముద్రాల సీ. | ఘంటసాల | నాగయ్య |
| 11 | నా కంటి పాపవైనా | (ఏ) | దాశరథి | పి.సుశీల | బి.సరోజాదేవి |
| 12 | నిర్దయా నీ మనంబేమో (ప) | (ఏ) | సముద్రాల సీ. | పి.సుశీల | బి.సరోజాదేవి |
| 13 | నీవు నేనూ కలసిననాడే | (యు) | డా. సినారె | ఘంటసాల, పి.సుశీల | ఎన్.టి.ఆర్., బి.సరోజాదేవి |
| 14 | పాతకాలం నాటి బెమ్మదేవుడా | (బ) | కొసరాజు | పిఠాపురం, మాధవపెద్ది, రాఘవులు | రేలంగి, రమణారెడ్డి, తదితరులు |
| 15 | మదిలో మౌనముగా | (ఏ) | డా. సినారె | ఘంటసాల | ఎన్.టి.ఆర్. |
| 16 | మధుర మధుర సుమసీమ | (బృం) | ఆరుద్ర | పి.సుశీల, బృందం | బి.సరోజాదేవి, తదితరులు |
| 17 | యశ్శివోనామరూపాభ్యాం | (శ్లో) | మహాకవి కాళిదాసు | ఘంటసాల | ఎన్.టి.ఆర్. |
| 18 | యాస్యత్యద్య శకుంత లేతి | (శ్లో) | మహాకవి కాళిదాసు | ఘంటసాల | నాగయ్య |
| 19 | శెంగాయి కట్టిన సిన్నది | (బృం) | కొసరాజు | ఘంటసాల, బృందం | లంక సత్యం, తదితరులు |
| 20 | సదాశివ శిరోరత్నం | (శ్లో) | మహాకవి కాళిదాసు | ఘంటసాల | ఎన్.టి.ఆర్. |
| 21 | సరసన నీవుంటే | (యు) | డా. సినారె | ఘంటసాల, పి.సుశీల | ఎన్.టి.ఆర్., బి.సరోజాదేవి |
కృతజ్ఞతలు : చిత్రంలోని పాటల వివరాలను "ఘంటసాల గళామృతము" బ్లాగ్ ద్వారా అందించిన శ్రీ కొల్లూరు భాస్కరరావు గారికి, సాహిత్యాన్ని"శతాబ్దిగాయకుడు ఘంటసాల" పుస్తకము ద్వారా అందించిన శ్రీ చల్లా సుబ్బారాయుడు గారికి , సీనియర్ సముద్రాల గారి గుఱించి ఇతర వివరాలను "జీవితమే సఫలము" మూడవ సంపుటిలో పొందుపరచిన డా. వి.వి. రామారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
ఘంటసాల గానపదసూచిక (HOME)
ఘంటసాల బ్లాగు (HOME)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి